UPI | క్రెడిట్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ క్రెడిట్ కార్డు జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ (Bank) వంటివి తన కస్టమర్లకు తీపికబురు అందించేందుకు రెడీ అవుతున్నాయి. రూపే క్రెడిట్ కార్డు (Credit Card) ఆన్ యూపీఐ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి. మార్చి కల్లా ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. రోజూవారీ ట్రాన్సాక్షన్ల విలువ పెరుగుతుంది.
ప్రస్తుతం మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డు ఆన్ యూపీఐ సర్వీసులు అందిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డుతో ట్రాన్సాక్షన్లు నిర్వహించడానికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో దిగ్గజ బ్యాంకులు కూడా ఈ సర్వీసులును కస్టమర్లకు అందించనున్నాయి. ఇటీవలనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు ఈ రూపే క్రెడిట్ కార్డు ఆన్ యూపీఐ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
కేంద్రం అదిరే ఆఫర్.. బ్యాంక్ అకౌంట్‌లోకి ఉచితంగా రూ. 10 వేలు పొందండిలా!
ఎన్‌పీసీఐ ఎండీ, సీఈవో దిలీప్ అబ్సే మాట్లాడుతూ.. అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూపే క్రెడిట్ కార్డులు జారీ చేస్తోందన్నారు. అలాగే పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి కూడా యూపీఐ ఫీచర్‌తో రూపే క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయని వెల్లడించారు. 2023 మార్చి కల్లా ఎస్‌బీఐ కార్డు, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా రూపే క్రెడిట్ కార్డులను తీసుకురానున్నాయని తెలిపారు. ఈ బ్యాంకులు ప్రస్తుతం టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పనిలో ఉన్నాయని పేర్కొన్నారు.
కస్టమర్లకు ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఆ చార్జీలు మాఫీ!
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది జూన్ నెలలో క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీని వల్ల కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని, డిజిటల్ పేమెంట్స్ కూడా మరింత పెరుగుతాయని ఆర్‌బీఐ పేర్కొంది. దీని వల్ల ఇప్పుడు బ్యాంకులు ఆ సర్వీసులు తీసుకువస్తున్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐతో నేరుగా మర్చంట్లకు పేమెంట్లు నిర్వహించొచ్చ.
అంతేకాకుండా ఎన్‌పీసీఐ కూడా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి రూ. 2 వేలకు లోపు ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే.. ఎలాంటి చార్జీలు ఉండవని తెలిపింది. దీని వల్ల రిటైల్ డిజిటల్ పేమెంట్లు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా యూపీఐ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ల వల్ల దేశంలో క్రెడిట్ కార్డు మార్కెట్ కూడా 2 నుంచి 2 రెట్లు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ అండ్ మార్కెటింగ్, కన్సూమర్ ఫైనాన్స్, పేమెంట్స్ బిజినెస్ కంట్రీ హెడ్ పరాగ్ రావు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axis bank, Credit card, Icici bank, Sbi, Sbi card, State bank of india