హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | ఎస్‌బీఐ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, డ్రైవింగ్ లైసెన్స్... ఇలా పలు అంశాల్లో అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. అవేంటో తెలుసుకోండి.

  కొత్త నెల ప్రారంభం కావడంతోనే కొన్ని కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తుంటాయి. రోజువారీ వ్యవహారాలకు సంబంధించినవి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి, ఇతర అంశాల్లో కొన్ని మార్పులు వస్తుంటాయి. అక్టోబర్ 1న కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డుల జారీ, పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు పేమెంట్స్, బ్యాంకుల్లో రుణాలు... ఇలా అనేక అంశాల్లో మారే కొత్త రూల్స్ ఏంటో తెలుసుకోండి.

  Driving License: అక్టోబర్ 1 నుంచి దేశంలో ఒకే తరహా డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డుల జారీ ప్రారంభం కానుంది. కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లో క్విక్ రెస్పాన్స్-QR కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్-NFC లాంటి అధునాతన ఫీచర్స్ ఉంటాయి. వీటి ద్వారా సెంట్రలైజ్డ్ ఆన్‌లైన్ డేటాబేస్‌లో 10 ఏళ్ల వరకు వాహనదారుల వివరాలు, చెల్లించిన పెనాల్టీలను భద్రపర్చొచ్చు.

  Smartphone Under Rs 10,000: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు లేటెస్ట్ మోడల్స్ ఇవే

  SBI ATM: ఏటీఎంలో డబ్బులు రాలేదా? అకౌంట్‌లో డెబిట్ అయ్యాయా? ఇలా చేయండి

  Credit cards: పెట్రోల్ బంకుల్లో ఇకపై మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఎలాంటి డిస్కౌంట్ లభించదు. డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించేందుకు ఆయిల్ కంపెనీలు గతంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇ వ్యాలెట్ పేమెంట్స్‌పై డిస్కౌంట్స్ ఇచ్చేవి. వీటిలో క్రెడిట్ కార్డ్ పేమెంట్లపై అక్టోబర్ 1 నుంచి డిస్కౌంట్లు ఉండవు. డెబిట్ కార్డులు, వ్యాలెట్ల ద్వారా పేమెంట్ చేస్తే డిస్కౌంట్ పొందొచ్చు.

  Loans: అక్టోబర్ 1 నుంచి పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. ఎక్స్‌టర్నల్ ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్స్ ద్వారా కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశించడంతో తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.

  SBI: యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తగ్గించనుంది. అక్టోబర్ 1 నుంచి మెట్రో, అర్బన్ సెంటర్‌లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.3,000 కాగా, రూరల్ బ్రాంచ్‌లల్లో రూ.1,000. ఈ బ్యాలెన్స్‌లో 50 శాతం తక్కువగా ఉంటే రూ.10+జీఎస్‌టీ, 50 నుంచి 75 శాతం తక్కువ ఉంటే రూ.12+జీఎస్‌టీ, 75 శాతం మించితే రూ.15+జీఎస్‌టీ చొప్పున పెనాల్టీ చెల్లించాలి.

  e-PAN Card Download: పాన్ కార్డు ఇంకా రాలేదా? ఇ-పాన్ సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండిలా

  Bank Holidays October 2020: అక్టోబర్‌లో బ్యాంకులకు 8 సెలవులు... ఎప్పుడెప్పుడంటే

  Corporate tax: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పొరేట్ పన్ను కోత అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

  Health Insurance: అక్టోబర్ 1 నుంచి హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరిగే అవకాశముంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీలో ఎక్కువ రోగాలను చేర్చుతుండటంతో ప్రీమియం ధర కూడా పెరుగుతుంది. గతంలో 30 రోగాలు హెల్త్ పాలసీలో కవర్ అయ్యేవి కావు. వాటిని 17 కు తగ్గించారు. దీంతో హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం 5 నుంచి 20 శాతం పెరగొచ్చని అంచనా.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Bank account, Bank loans, Banking, Car loans, Credit cards, Driving licence, Gold loans, Health Insurance, Home loan, Housing Loans, Insurance, Personal Loan, Petrol pump, Sbi, State bank of india

  ఉత్తమ కథలు