Bank Auctions: తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్న SBI.. తక్కువ ధరకే సొంతం చేసుకున్న ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India - SBI) వద్ద కస్టమర్లు తనఖా పెట్టిన వెయ్యికిపైగా స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక ఆస్తులను ఎస్బీఐ (SBI) నేటి నుంచి వేలం వేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
సాధారణంగా బ్యాంకులు (Banks), ఆర్థిక సంస్థలు (Financial Institutions) తమ వద్ద కస్టమర్ల ఆస్తులను తనఖా పెట్టుకొని అప్పులు (Loans) ఇస్తుంటాయి. ఒకవేళ తాము తీసుకున్న అప్పును సదరు కస్టమర్ బ్యాంకుకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. ఆ ఆస్తులను బ్యాంకులు వేలం(Auction) వేస్తాయి. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India - SBI) వద్ద కస్టమర్లు తనఖా పెట్టిన వెయ్యికిపైగా స్థలాలు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, పారిశ్రామిక ఆస్తులను ఎస్బీఐ (SBI) నేటి నుంచి వేలం వేయనుంది. గత వారం బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) కూడా ఇలాంటి కార్యక్రమమే చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ వేలంపాటలో ఎలా పాల్గొనాలి, వీటిని సొంతం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.

తక్కువ ధరకే లభించే అవకాశం
మార్కెట్ ధరల కన్నా కొంచెం తక్కువ ధరకే ఆస్తులను వేలంలో ఉంచుతున్నారని అనారాక్ ప్రాపర్టీ ఛైర్మన్ అనూజ్ పురి తెలిపారు. మార్కెట్ ధర కన్నా 20 నుంచి 30 శాతం తక్కువకే ఈ ఆస్తులను వేలంలో సొంతం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.50 లక్షల లోన్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా

లొకేషన్ అడ్వాంటేజ్
కొత్త ఇళ్లు, స్థలాలు నగరానికి దూరంగా ఉంటాయి. అయితే తాజాగా బ్యాంకు వేలంలో ఉంచిన అనేక ఆస్తులు నగరాల్లోనే ఉంటాయి. దీనివల్ల ప్రైమ్ లొకేషన్ లో ఆస్తులను వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని పురి తెలిపారు.
Bank Locker Rules: బ్యాంకు లాకర్ ఉపయోగిస్తున్న వారికి అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి

ఆలస్యం అవుతుందన్న బెంగలేదు
నిర్మాణంలో ఉన్న ఇళ్లు కొనుగోలు చేస్తే అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. బిల్డర్ చెప్పిన సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోవచ్చు. వేలం ద్వారా కొనుగోలు చేసుకుంటే ఇలాంటి సమస్యలుండవు.

ఎలా ఉంటే అలాగే వేలం
వేలంలో ఉంచే భవనాల స్థితి ఒక్కోసారి దారుణంగా ఉండవచ్చు. ఎందుకంటే బ్యాంకులు వారిచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకు మాత్రమే వేలం వేస్తాయి. అందుకే భవనాలు, ఆస్తులు ఏ కండీషన్ లో ఉంటే అలాగే వేలం వేస్తారు.

మీరే చెక్ చేసుకోవాలి
వేలంలో కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ కేసులైమేనా ఉన్నాయా, ఆస్తిపన్ను బకాయిలు, వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను కొనుగోలుదారులే చెక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఆ ఇళ్లలో ఎవరైనా నివసిస్తున్నారా?
వేలంలో మీరు కొనాలనుకుంటున్న ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా లేదా పరిశీలించాలి. ఎందుకంటే ప్రాపర్టీ మన చేతికి వచ్చాక అలాంటి వారిని ఖాళీ చేయించే బాధ్యతను బ్యాంకులు తీసుకోవు.

గరిష్ఠ ధరకు లిమిట్ లేదు
వేలంలో ఉంచిన ప్రాపర్టీ ఎంతకు దక్కుతుందో చెప్పలేం. ఎందుకంటే ఎవరు ఎక్కువ ధరకు వేలంలో పాడుకుంటే వారికే దక్కుతుంది.

న్యాయపరమైన అడ్డంకులు
ఆస్తిని వేలం వేసిన బ్యాంకులు, ఆ ప్రాపర్టీ యజమాని ఇద్దరూ అంగీకరిస్తే అలాంటి దాన్ని స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. లేదంటే న్యాయపరమైన చిక్కులు తప్పవు.

కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి
కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసుకుంటే పేమెంట్ చేసేందుకు కనీసం 45 నుంచి 60 రోజుల సమయం ఇస్తారు. కానీ ఆస్తుల వేలంలో పాల్గొనే ముందే ఆస్థి విలువపై పది శాతం చెల్లించి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. బిడ్డింగ్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తే.. ఆ తరువాత రోజే మరో 25 శాతం బ్యాంకుకు చెల్లించాలి. మిగిలిన మొత్తం మరో 15 రోజుల్లోనే బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published: