SBI: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? ఈ విషయం తెలుసా?

SBI ATM Withdrawal rules | ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి ఉన్న నియమనిబంధనల్ని తెలుసుకోకుండా ఏటీఎంకు వెళ్తే మీకు తెలియకుండా అనేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఏటీఎం విత్‌డ్రాయల్ రూల్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: August 18, 2020, 10:48 AM IST
SBI: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? ఈ విషయం తెలుసా?
SBI: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? ఈ విషయం తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్‌బీఐ ఏటీఎంలో తరచూ డబ్బులు డ్రా చేస్తుంటారా? అయితే మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్‌బీఐ ఏటీఎంలో మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మీరు ఛార్జీలు చెల్లించాలి. అవును... ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ పేరుతో ఎస్‌బీఐ ఛార్జీలు వసూలు చేస్తుంది. మీ అకౌంట్‌లో సరిపడా డబ్బులు లేనప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు రూ.20+జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్‌బీఐ. అందుకే డబ్బులు డ్రా చేసేముందే మీ బ్యాలెన్స్ ఎంతో చెక్ చేసుకొని ఏటీఎంకు వెళ్లడం మంచిది. ఏటీఎంలో కాకుండా మీ బ్యాలెన్స్ ఎన్ని రకాలుగా చెక్ చేయొచ్చు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SBI Loan: 59 నిమిషాల్లో ఎస్‌బీఐ పర్సనల్, బిజినెస్, హోమ్ లోన్... అప్లై చేయండిలా

PAN Card: పాన్ కార్డులో తప్పులున్నాయా? ఈ యాప్‌లో అప్లై చేయండి ఇలా

జూలై 1న ఎస్‌బీఐ ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు మారిన సంగతి తెలిసిందే. అంతకుముందు కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏటీఎం విత్‌డ్రా విషయంలో కొన్ని మినహాయింపులు, సడలింపులు ఇచ్చింది బ్యాంకు. కానీ జూలై 1 నుంచి పాత నియమనిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లు 8 సార్లు మాత్రమే ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు జరపొచ్చు. 5 సార్లు ఎస్‌బీఐ ఏటీఎంలో, 3 సార్లు ఇతర బ్యాంకు ఏటీఎంలో లావాదేవీలు జరపొచ్చు. నాన్ మెట్రోలో అయితే 10 ఏటీఎం లావాదేవీలు ఉచితం. అందులో 5 ఎస్‌బీఐ ఏటీఎంలు, 5 ఇతర బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

SBI: రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలా? ఓటీపీతో చేయండి ఇలా

Smartphone: కొత్త ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1,00,000 కన్నా ఎక్కువ యావరేజ్ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లు ఎస్‌బీఐ గ్రూప్ ఏటీఎంలల్లో ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు. ఇక ఎస్‌బీఐ ఏటీఎంలల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. ఈ నిబంధనను 2020 జనవరి 1 నుంచి అమలు చేస్తోంది బ్యాంకు. కార్డు మోసాలను అరికట్టేందుకు అదనంగా ఈ సెక్యూరిటీ ఫీచర్ అమలు చేసింది.
Published by: Santhosh Kumar S
First published: August 18, 2020, 10:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading