Home /News /business /

SBI ATM SAFETY MANTRA PRACTICE THESE SIMPLE AND SMART TIPS TO KEEP YOUR MONEY SAFE SS

SBI: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక... ఈ 10 టిప్స్ గుర్తుంచుకోండి

SBI: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక... ఈ 10 టిప్స్ గుర్తుంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

SBI: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక... ఈ 10 టిప్స్ గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

SBI Safety Tips | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? డబ్బుల కోసం ఏటీఎంకు వెళ్తుంటారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి.

    లాక్‌డౌన్ సమయంలో డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త అంటోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కస్టమర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఏటీఎం కేంద్రంగా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఎస్‌బీఐలో 44 కోట్ల మంది కస్టమర్లు ఉన్న సంగతి తెలిసిందే. వారందర్నీ హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. ఏటీఎంకు వెళ్లే కస్టమర్లు ఈ 10 సేఫ్టీ టిప్స్ పాటించాలని సూచిస్తోంది. అవేంటో మీరూ తెలుసుకొని పాటించండి.

    SBI Safety Tips: ఎస్‌బీఐ సేఫ్టీ టిప్స్


    1. మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేప్పుడు మీ పిన్ ఎవరూ చూడకుండా జాగ్రత్తపడండి. ఓ చేతితో పిన్ ఎంటర్ చేస్తున్నప్పుడు మరో చేతిని అడ్డుగా పెట్టండి.
    2. మీ ఏటీఎం పిన్‌ను కార్డుపైన రాయకూడదు. ఎక్కడా మీ పిన్ రాయకపోవడమే మంచిది. మీ పిన్‌ను గుర్తుపెట్టుకోవాలి.
    3. మీ బర్త్ డే, పెళ్లి రోజు, వాహనం నెంబర్ లాంటివి పిన్ నెంబర్లుగా పెట్టకూడదు.
    4. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ స్లిప్‌ను మీతోపాటు తీసుకెళ్లాలి. స్లిప్‌లో ట్రాన్సాక్షన్ వివరాలు చూసిన తర్వాత చింపెయ్యాలి.
    5. ఏటీఎంలో స్కిమ్మింగ్ డివైజ్‌, సీక్రెట్ కెమెరాలు ఉన్నాయేమో గమనించాలి.
    6. ఎస్‌బీఐ మిస్డ్ కాల్ ఆప్షన్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ వివరాలు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.
    7. ఓటీపీ, డెబిట్ కార్డ్ పిన్, మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరికీ షేర్ చేయొద్దు.
    8. మీ ఏటీఎం పిన్, ఇతర వివరాలు అడుగుతూ ఎవరైనా ఎస్ఎంఎస్, ఇమెయిల్ పంపినా, కాల్ చేసినా వివరాలు వెల్లడించొద్దు.
    9. ఏటీఎం లోపలికి వెళ్లే ముందు అక్కడ ఎవరైనా ఉన్నారేమో గమనించాలి. ఏటీఎం లోపలికి ఒకరు మాత్రమే వెళ్లాలి.
    10. ఏటీఎంలో మీరు డబ్బులు డ్రా చేసే సమయంలో ఎవరైనా ఉంటే మీ కార్డు వివరాలు, పిన్ వారు తెలుసుకునే అవకాశం ఉంది.

    ఇవి కూడా చదవండి:

    Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచే సేల్

    Special Trains: రేపటి నుంచి స్పెషల్ ట్రైన్స్... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే

    IRCTC: ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్స్... టికెట్లు తీసుకోండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank account, Banking, CYBER CRIME, Fraud, Online fraud, Personal Data, Personal Finance, Sbi, State bank of india

    తదుపరి వార్తలు