కొత్త నెల వచ్చిందంటే కొత్త రూల్స్ కూడా వస్తుంటాయి. జూలై 1న కూడా కొత్త నియమనిబంధనలు అమలులోకి రానున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, బ్యాంకులు, గ్యాస్ సిలిండర్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఇలా చాలా అంశాల్లో కొత్త రూల్స్ జూలై 1న అమల్లోకి వస్తాయి. ఈ రూల్స్ తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ అవసరమే. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి 2021 జూలై 1న మారబోయే ఆ రూల్స్ ఏంటీ? అమల్లోకి వచ్చే నియమనిబంధనలేంటీ? అవి మీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తెలుసుకోండి.
SBI ATM New Charges: జూలై 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కొత్త ఛార్జీలను అమలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో నాలుగు సార్లు ఉచితంగా డబ్బులు డ్రా చేయడం ఉచితమే. ఆ తర్వాత జరిపే ప్రతీ లావాదేవీకి జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ వర్తిస్తుంది. రూ.15+జీఎస్‌టీ చెల్లించాలి.
PF Aadhaar Link: పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ తప్పనిసరి... ఈ స్టెప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు ఈ 9 టిప్స్ గుర్తుంచుకోండి
SBI Cheque Book Charges: ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ ఉన్నవారు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ చెక్ బుక్ ఉచితంగా పొందొచ్చు. మరో 10 చెక్స్ ఉన్న బుక్ కోసం రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కోసం రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి.
Syndicate Bank: సిండికేట్ బ్యాంక్ కెనెరా బ్యాంకులో విలీనమైన సంగతి తెలిసిందే. 2021 జూలై 1 నుంచి పాత సిండికేట్ బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ ఏవీ పనిచేయవు. జూలై 1 నుంచి CNRB ఉన్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ మాత్రమే ఉపయోగించాలని కెనెరా బ్యాంక్ స్పష్టం చేసింది.
PAN Aadhaar Link: ఆధార్ కార్డ్ లింక్ చేయని పాన్ కార్డులు 2021 జూలై 1 నుంచి చెల్లవు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి జూన్ 30 వరకే గడువు ఉంది. ఆ తర్వాత పాన్, ఆధార్ లింక్ చేస్తే రూ.1,000 జరిమానా చెల్లించాలి. పాన్ ఆధార్ ఎలా లింక్ చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. పాన్ ఆధార్ లింక్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
SBI Scheme: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు... స్కీమ్ వివరాలివే
ATM Withdrawal Rules: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 4 రూల్స్ గుర్తుంచుకోండి
LPG Gas Cylinder: ప్రతీ నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. మరి ఈసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయో తగ్గుతాయో తెలియాలంటే జూలై 1 వరకు వేచిచూడాలి.
Hero Motocorp: హీరో బైక్ కొనాలనుకుంటున్నారా? జూలై 1న ధరలు పెరగనున్నాయి. హీరో వాహనాల ధరల్ని రూ.3,000 పెంచుతున్నట్టు హీరో మోటోకార్ప్ ఇప్పటికే ప్రకటించింది. కొత్త ధరలు జూలై 1న అమల్లోకి వస్తాయి.
TDS: జూలై 1న టీడీఎస్ రూల్స్ మారనున్నాయి. జూన్ 30 లోగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయనివారు జూలై 1 నుంచి డబుల్ టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి జీతాలు పెరగనున్నాయి. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ నిలిపివేసిన సంగతి తెలిసిందే. డీఏ రీస్టోర్ చేస్తుండటంతో 11 శాతం డీఏ పెరగనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ పెరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 7th Pay Commission, Aadhaar Card, Aadhaar card, AADHAR, Bank account, Bank charges, Banking, Canara Bank, Check the Price of LPG, Hero moto corp, Income tax, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price, PAN, PAN card, Personal Finance, Sbi, State bank of india, Syndicate Bank