SBI: ఎస్‌బీఐలో 9 నెలల్లో 15 లక్షల మంది ఈ స్కీమ్‌లో చేరారు... మీరూ చేరండి ఇలా

SBI: ఎస్‌బీఐలో 9 నెలల్లో 15 లక్షల మంది ఈ స్కీమ్‌లో చేరారు... మీరూ చేరండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Atal Pension Yojana | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ద్వారా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మీరూ ఈ స్కీమ్‌లో ఎలా చేరొచ్చో తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI... భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. మొత్తం 44.89 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది ఎస్‌బీఐ. బ్యాంకింగ్ సేవలు మాత్రమే కాదు... పలు ప్రభుత్వ పథకాలను తమ కస్టమర్లకు అందిస్తోంది ఎస్‌బీఐ. అందులో అటల్ పెన్షన్ యోజన-APY పథకం కూడా ఒకటి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంటే 9 నెలల్లో ఎస్‌బీఐ ద్వారా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరినవారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 15 లక్షలు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA లెక్కల ప్రకారం 9 నెలల్లో 52 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు చేరితే అందులో 15 లక్షల మంది ఎస్‌బీఐ ద్వారా ఈ పథకంలో చేరడం విశేషం. ఇక ఇప్పటివరకు ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 2.75 కోట్లు.

    కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఈ స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య భారీగా పెరిగిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకుల ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. ఎస్‌బీఐకి కస్టమర్ల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఈ బ్యాంకు ద్వారానే అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో చేరుతుండటం విశేషం. మీరు ఎస్‌బీఐ ద్వారా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలనుకుంటే యాక్టీవ్‌లో ఉన్న అకౌంట్ ఉండాలి. దీంతో పాటు కేవైసీ వివరాలు అప్‌డేట్ చేసి ఉండాలి. మీరు కూడా ఎస్‌బీఐ కస్టమర్ అయితే అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.

    Paytm Instant Personal Loan: 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్... పేటీఎం యూజర్లకు మాత్రమే

    NPS Scheme: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? ఈ స్కీమ్ మీకోసమే

    SBI Atal Pension Yojana: ఎస్‌బీఐ ద్వారా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరండి ఇలా


    ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్ https://www.onlinesbi.com/ ఓపెన్ చేయండి.
    మీ వివరాలతో లాగిన్ అయిన తర్వాత Social Security Schemes సెలెక్ట్ చేయండి.
    అందులో Atal Pension Yojana సెలెక్ట్ చేయండి.
    ఆ తర్వాత అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో మీరు లింక్ చేయాలనుకున్న అకౌంట్‌ను సెలెక్ట్ చేయండి.
    ఆ తర్వాత కస్టమర్ ఐడెంటిఫికేషన్ నెంబర్-CIF సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
    CIF సెలెక్ట్ చేసిన తర్వాత ఇ-ఫామ్ ఫిల్ చేయాలి.
    మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత నామినీ వివరాలు ఎంటర్ చేయాలి.
    మీరు ఈ స్కీమ్‌లో జమ చేసేందుకు మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
    ఎంత జమ చేయాలనుకుంటున్నారో కూడా వెల్లడించాలి.
    ఆ తర్వాత ఫామ్ సబ్మిట్ చేయాలి.
    అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    LIC New Jeevan Anand Plan: ఇన్స్యూరెన్స్ పాలసీపై ఎక్కువ లాభాలు కావాలా? ఈ ప్లాన్ మీకోసమే

    PMSYM Scheme: మీ జీతం తక్కువా? అయితే వెంటనే ఈ స్కీమ్‌లో చేరండి

    Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో లాభాలేంటీ?


    అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన పథకమే అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్‌లో ప్రతీ నెల రూ.42 నుంచి రూ.1,454 మధ్య జమ చేసి రిటైర్మెంట్ వయస్సు నుంచి నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ పొందొచ్చు. అంటే నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. జమ చేసే మొత్తాన్ని బట్టి ఈ పెన్షన్ మారుతుంది. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరొచ్చు. ఏ వయస్సులో చేరినా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డబ్బులు జమ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published: