స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI బ్యాంకింగ్ సేవలతో పాటు పలు పథకాలను కూడా అందిస్తోంది. అందులో యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో ఒకసారి డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు... ప్రతీ నెల కొంతకాలంపాటు అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో డబ్బులు అకౌంట్‌లో జమ అవుతాయి. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినవారికి, రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెల కొంత డబ్బులు కావాలనుకునేవారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. డిపాజిట్ చేసే మొత్తం, ఎంచుకున్న కాలాన్ని బట్టి ప్రతీ నెల వచ్చే డబ్బులు ఆధారపడి ఉంటాయి.
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలల కాలానికి డిపాజిట్ చేయొచ్చు. అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఒక బ్రాంచ్‌లో ఈ స్కీమ్‌లో చేరితే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. మైనర్లు కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. సింగిల్ లేదా జాయింట్‌గా ఈ స్కీమ్‌లో చేరే అవకాశం ఉంది.
Bank Account: ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త రూల్స్
ATM Withdrawal Rules: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? ఈ 4 రూల్స్ గుర్తుంచుకోండి
ఈ స్కీమ్ ద్వారా నెలకు కనీసం రూ.1,000 పొందొచ్చు. ఇక ఈ స్కీమ్‌లో కనీసం రూ.25,000 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. సాధారణ కస్టమర్లకు, సీనియర్ సిటిజన్లకు వర్తించే వడ్డీ రేట్లే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో ఉంటాయి. ఏ తేదీన డిపాజిట్ చేస్తే వచ్చే నెల నుంచి అదే తేదీలో డబ్బులు అకంట్‌లో జమ అవుతాయి. లేదా ఒక రోజు ముందు జమ అవుతాయి.
SBI New Charges: జూలై 1 నుంచి ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త ఛార్జీలు
Credit Card: ఈ క్రెడిట్ కార్డుతో 71 లీటర్ల పెట్రోల్ ఫ్రీ... ఆఫర్ వివరాలు ఇవే
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో నామినేషన్ సదుపాయం ఉంది. ఓవర్‌డ్రాఫ్ట్ లేదా లోన్ సదుపాయం కూడా ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాలెన్స్ మొత్తంలో 75 శాతం వరకు లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. లోన్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకుంటే ఆ తర్వాత నెల నుంచి వచ్చే డబ్బులు లోన్ అకౌంట్‌లో జమ అవుతాయి. ఒకవేళ డిపాజిట్‌దారు మరణిస్తే ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అనుమతి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, Sbi, State bank of india