హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... మీ అకౌంట్‌లోకి ప్రతీ నెలా డబ్బులు

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... మీ అకౌంట్‌లోకి ప్రతీ నెలా డబ్బులు

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... మీ అకౌంట్‌లోకి ప్రతీ నెలా డబ్బులు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Scheme: ఎస్‌బీఐ స్కీమ్... మీ అకౌంట్‌లోకి ప్రతీ నెలా డబ్బులు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Scheme | ఎస్‌బీఐలో ఓ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే ప్రతీ నెలా మీ అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి. అసలుతోపాటు, వడ్డీ వెనక్కి పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుల్ని ఎక్కడ దాచుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయా అని ఆలోచిస్తుంటారు సీనియర్ సిటిజన్లు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో (Deposit Schemes) డబ్బులు దాచుకుంటే రిస్క్ తక్కువ. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాంటి బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే రిస్క్ అస్సలు ఉండదు. అందుకే సీనియర్ సిటిజన్లు ఇలాంటి సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చూస్తుంటారు. సీనియర్ సిటిజన్లు మాత్రమే కాదు, ఎవరికైనా పెద్దమొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు, ఆ డబ్బులతో రెగ్యులర్‌గా ఆదాయం కావాలనుకుంటే ఇలాంటి సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపయోగకరంగా ఉంటాయి. వారి కోసం ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme) అందిస్తోంది.

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటీ?

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తే, కస్టమర్లకు ప్రతీ నెలా కొంత అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. అసలులో కొంత మొత్తంతో పాటు, వడ్డీ కలిపి అకౌంట్‌లో జమ అవుతుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో ఎన్ని నెలల వరకు డబ్బులు కావాలో ముందుగానే చెప్తే దాని ప్రకారం, ప్రతీ నెల సమానంగా అకౌంట్‌లోకి డబ్బులు వస్తుంటాయి.

Wedding Insurance: పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం... వివాహ వేడుకకూ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇలా

సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బులు జమ చేస్తే మెచ్యూరిటీ సమయంలో అసలు, వడ్డీ కలిపి వస్తాయి. కానీ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో ప్రతీ నెలా అకౌంట్‌లో డబ్బులు జమ అవుతుంటాయి. టర్మ్ డిపాజిట్‌కు ఉన్న వడ్డీ రేట్లే యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌కు వర్తిస్తాయి. సాధారణ కస్టమర్లకు ఉన్న వడ్డీ రేట్లే ఈ స్కీమ్‌కు కూడా వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అయితే 50 బేసిస్ పాయింట్స్ అంటే అరశాతం వడ్డీ ఎక్కువగా వస్తుంది. యాన్యుటీ డిపాజిట్‌లో లభించే వడ్డీకి టీడీఎస్ వర్తిస్తుంది.

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేసేవారు 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు లేదా 120 నెలల కాలాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. కనీస మంత్లీ యాన్యుటీ రూ.1,000 లభిస్తుంది. మీరు ఏ రోజున డబ్బులు డిపాజిట్ చేస్తే వచ్చే నెల అదే రోజున మీ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.

IRCTC Kerala Tour: హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో కేరళ టూర్ ... ప్యాకేజీ ధర రూ.12,000 లోపే

ఈ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని నెలలు ఎంచుకుంటే అన్ని నెలలు అకౌంట్‌లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ముందుగానే డబ్బులు వెనక్కి తీసుకోవాలనుకుంటే రూ.15,00,000 వరకు అనుమతి ఉంటుంది. కానీ పెనాల్టీ ఛార్జీలు ఉంటాయి. ఒకవేళ డిపాజిటర్ మరణిస్తే ఎలాంటి లిమిట్ లేకుండా ప్రీమెచ్యూర్ పేమెంట్ తీసుకోవచ్చు.

First published:

Tags: Personal Finance, Sbi, Sbi deposits

ఉత్తమ కథలు