హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Scheme: ఈ ఎస్‌బీఐ స్కీమ్‌లో చేరితే రెగ్యులర్‌గా రూ.10,000 ఆదాయం

SBI Scheme: ఈ ఎస్‌బీఐ స్కీమ్‌లో చేరితే రెగ్యులర్‌గా రూ.10,000 ఆదాయం

SBI Scheme | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే నెలకు రూ.10,000 ఆదాయం పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

SBI Scheme | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే నెలకు రూ.10,000 ఆదాయం పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

SBI Scheme | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే నెలకు రూ.10,000 ఆదాయం పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  మీ దగ్గరున్న డబ్బు దాచుకొని ప్రతీ నెలా ఆదాయం పొందాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా రూ.10,000 వరకు ఆదాయం పొందొచ్చు. సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే వడ్డీ వస్తుందని తెలుసు. అయితే రెగ్యులర్‌గా ఆదాయం కోరుకునేవారికి యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (Annuity Deposit Scheme) ఉపయోగపడుతుంది. ఇది ఎస్‌బీఐ అందిస్తున్న స్పెషల్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్‌డ్‌గా మంత్లీ ఇన్‌కమ్ వస్తుంది. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ డబ్బులు వచ్చినవారు లేదా ఆస్తులు అమ్మడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినవారు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతీ నెలా ఆదాయం పొందొచ్చు.

  ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. మైనర్లు, మేజర్లు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎంతకాలం డబ్బులు దాచుకోవాలన్నది మీ ఇష్టం. 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలలకు మీ డబ్బుల్ని డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.25,000 పొదుపు చేయాలి. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా జమ చేయొచ్చు. కనీసం రూ.1,000 నుంచి ప్రతీ నెలా ఆదాయం లభిస్తుంది.

  Important Dates: ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఇవే

  వడ్డీ రేట్ల విషయానికి వస్తే సాధారణ కస్టమర్లకు, వృద్ధులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లే ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌కు వర్తిస్తాయి. మీరు ఈ నెలలో ఏ తేదీన ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రతీ నెలా అదే తేదీన మీకు వడ్డీ అకౌంట్‌లో జమ అవుతుంది. లేదా ఒకట్రెండు రోజుల ముందే వడ్డీ లభిస్తుంది. దేశంలోని అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసినవారికి యూనివర్సల్ పాస్‌బుక్ ఇస్తుంది బ్యాంకు.

  Mutual Fund SIP: ఇలా పొదుపు చేస్తే రూ.11 కోట్లు మీవే... సేవింగ్స్ ప్లాన్ చేయండిలా

  ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో చేరేవారు నామినీ వివరాలు వెల్లడించాలి. అకౌంట్ హోల్డర్ మరణిస్తే డబ్బులు నామినీకి లభిస్తాయి. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్‌పై లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఆస్పత్రి ఖర్చులు, అత్యవసర ఖర్చుల కోసం 75 శాతం వరకు లోన్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే సదుపాయం ఉంది.

  ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా రూ.10,000 ఆదాయం పొందాలనుకుంటే రూ.5,07,964 జమ చేయాలి. ప్రతీ నెలా రూ.10,000 చొప్పున అకౌంట్‌లో జమ అవుతుంది.

  First published:

  Tags: Personal Finance, Save Money, Sbi, State bank of india