హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money Schemes: ఆ పాపులర్ స్కీమ్స్ మార్చి 31 వరకే... ఇప్పుడే చేరితే ఎక్కువ లాభం

Money Schemes: ఆ పాపులర్ స్కీమ్స్ మార్చి 31 వరకే... ఇప్పుడే చేరితే ఎక్కువ లాభం

Money Schemes: ఆ పాపులర్ స్కీమ్స్ మార్చి 31 వరకే... ఇప్పుడే చేరితే ఎక్కువ లాభం
(ప్రతీకాత్మక చిత్రం)

Money Schemes: ఆ పాపులర్ స్కీమ్స్ మార్చి 31 వరకే... ఇప్పుడే చేరితే ఎక్కువ లాభం (ప్రతీకాత్మక చిత్రం)

Money Schemes | ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న రెండు పాపులర్ స్కీమ్స్ మార్చి 31న ముగుస్తాయి. ఈ స్కీమ్స్‌లో ఇప్పుడే చేరితే ఎక్కువ లాభం పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

సేవింగ్స్ అకౌంట్‌లో (Savings Account) డబ్బులు ఉంటే వడ్డీ చాలా తక్కువగా వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ (Fixed Deposit Schemes) అయితే కాస్త ఎక్కువ వడ్డీ వస్తుంది. రిస్క్ ఏమీ ఉండదు. అందుకే రిస్క్ లేకుండా వడ్డీ పొందాలనుకునేవారు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌ని ఎంచుకుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో కూడా పలు రకాలు ఉంటాయి. బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో కూడా ఎక్కువ వడ్డీ (Interest Rates) ఇచ్చే పథకాలను అప్పుడప్పుడూ ప్రకటిస్తుంటాయి. ఈ పథకాలు ఎప్పుడూ అందుబాటులో ఉండవు. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో చేరినవారికి మాత్రమే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అలాంటి రెండు పథకాలు మార్చి 31న ముగియనున్నాయి. ఆ స్కీమ్స్ గురించి తెలుసుకోండి.

ఎస్‌బీఐ అమృత్ కలష్ ఎఫ్‌డీ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొంతకాలం క్రితం అమృత్ కలష్ పేరుతో ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 400 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో చేరినవారికి 7.60 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఎస్‌బీఐలో సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో వడ్డీ 7 శాతం లోపే లభిస్తున్న సంగతి తెలిసిందే. అమృత్ కలష్ ఎఫ్‌డీ స్కీమ్‌లో డబ్బులు దాచుకుంటే 7.60 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఈ స్కీమ్‌లో సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ లభిస్తుంది.

New Rules: ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్... గుర్తుంచుకోకపోతే చిక్కులు తప్పవు

ఎస్‌బీఐ 2023 ఫిబ్రవరి 15న వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 45 రోజులకు 3 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులకు 4.5 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులకు 5.25 శాతం, 211 రోజుల నుంచి 1 ఏడాది లోపు 5.75 శాతం, 1 ఏడాది నుంచి 2 ఏళ్లకు 6.80 శాతం, 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు 7 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు 6.50 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీ లభిస్తుంది.

PAN Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఈ 5 సమస్యలు తప్పవు మరి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎ‌ఫ్‌డీ

కరోనా వైరస్ మహమ్మారి కాలంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎ‌ఫ్‌డీ పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రకటించింది. 2020 మేలో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. పలుమార్లు ఈ స్కీమ్‌ని పొడిగించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఈ స్కీమ్ కూడా 2023 మార్చి 31న ముగియనుంది. రూ.5 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. సాధారణంగా వృద్ధులకు 0.50 శాతం వడ్డీ అదనంగా ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా అదనంగా మరో 0.25 శాతం వడ్డీ పొందొచ్చు. అయితే 2023 మార్చి 31 లోపు ఈ స్కీమ్‌లో చేరేవారికి మాత్రమే అదనంగా వడ్డీ లభిస్తుంది.

First published:

Tags: FD rates, Fixed deposits, Interest rates, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు