• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • SAY NO TO SWIGGY STARTS FROM TODAY BY HOTELS MANAGEMENTS NK

ఫుడ్ డెలివరీ యాప్‌లకు షాక్... ఇక రెస్టారెంట్లే డైరెక్టుగా డెలివరీ

ఫుడ్ డెలివరీ యాప్‌లకు షాక్... ఇక రెస్టారెంట్లే డైరెక్టుగా డెలివరీ

ప్రతీకాత్మక చిత్రం

Say No to Swiggy : ఫుడ్ డెలివరీ చేస్తున్న యాప్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బట్ ఏం లాభం... కమీషన్ బాగానే లాగేస్తున్నాయన్న విమర్శలున్నాయి.

 • Share this:
  Andhra Pradesh : మనమంతా ఫుడ్ డెలివరీ ఎందుకు తెప్పించుకుంటాం. ఇళ్లలో వండుకునే టైమ్ లేకపోవడం, లంచ్ టైమ్‌కి ఆఫీసుల్లో ఉండటం ఇలాంటి ఎన్నో కారణాలతో చాలా మంది ఫుడ్ డెలివరీ యాప్‌లలో పుడ్ ఆర్డర్స్ తెప్పించుకుంటున్నారు. ఐతే... ఈ యాప్‌లన్నీ ఆయా రెస్టారెంట్ల దగ్గర ఆ ఫుడ్ తీసుకొని... దాన్ని ఆర్డర్ అడిగిన వారికి తెచ్చి ఇస్తాయి. అలా తెచ్చి ఇస్తున్నందుకు 5 నుంచీ 10 శాతం కమిషన్ తీసుకుంటాయి. ఐతే... ఈమధ్య స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ వంటి సంస్థలు కమిషన్ పెంచేశాయి. పైకి మాత్రం ఈ యాప్‌లు ఫుడ్‌పై డిస్కౌంట్ ఇస్తున్నట్లు యాడ్స్ ఇస్తున్నాయి. లోపల మాత్రం కమిషన్ 20 నుంచీ 30 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే... రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై కమిషన్‌ను నానాటికీ పెంచుకుంటూ పోవడమే కాదు... కస్టమర్లకు చేసే కాల్ ఛార్జీలను కూడా రెస్టారెంట్లపైనే రుద్దడం, ఇవన్నీ చాలవన్నట్లుగా రహస్య ఛార్జీల విధింపుపై రెస్టారెంట్స్ ఓనర్లు భగ్గుమంటున్నారు. ఈ బ్లాక్‌మెయిల్‌కి చెక్ పెట్టాలంటూ... విజయవాడలో ఇవాళ్టి నుంచీ ఆన్‌లైన్ ఆర్డర్లకు తామే స్వయంగా... ఫుడ్ డెలివరీ చేస్తామని రెస్టారెంట్ల యజమానుల సంఘం తెలిపింది.

  ప్రస్తుతం ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల... రెస్టారెంట్ల బిజినెస్ బాగా పడిపోయింది. చాలా మంది కస్టమర్లు... ఆ రేట్లు భరించలేక... ఏదో ఒక తిప్పలు పడి... ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకుంటున్నారు. ఫలితంగా ఇదివరకు వచ్చిన ఆర్డర్లు ఇప్పుడు రెస్టారెంట్లకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి నుంచీ స్విగ్గీని నిషేధిస్తున్నట్లు రెస్టారెంట్ల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఇందుకోసం "సే నో టూ స్విగ్గీ" నినాదంతో యాప్ నుంచి లాగ్ ఆఫ్ కావాలని విజయవాడ హోటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది.

  ఇకపై ఎవరైనా ఫుడ్ కావాలంటే... డైరెక్టుగా రెస్టారెంట్‌కే ఫోన్ చేసి ఆర్డర్ కోరాలనీ, ఫలితంగా యాప్‌లలో కంటే తక్కువ రేటుకే తాము డెలివరీ చేస్తామని రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. డిస్కౌంట్లు కూడా ఇస్తామంటున్నారు.

  ఏడాదిన్నర కిందట రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్ లైన స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ ఒక్కొక్కటిగా ప్రవేశించాయి. తొలుత జీరో కమిషన్ పద్ధతిలో కస్టమర్ల నుంచి ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించిన ఈ యాప్‌లు... తర్వాత ఒక్కో రూపాయీ కమిషన్ పెంచుకుంటూ పోయాయి. నేటి ఉదయం 6 గంటలకు ఆన్‌లైన్‌లో స్విగ్గీ యాప్ నుంచి హోటళ్లన్నీ లాగ్ అవుట్ అయ్యాయి. ఫలితంగా స్విగ్గీకి ఆర్డర్లు నిలిచిపోయాయి.

  విజయవాడలో మారుతున్న పరిస్ధితులతో హోటళ్లు ఒక్కొక్కటిగా దివాళా తీస్తున్నాయి. దశాబ్దాలుగా నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్న హోటళ్లన్నీ ఆన్ లైన్ ఆర్డర్ల దెబ్బకు తమ రూపురేఖలు మార్చుకుంటున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల రాకతో వాటి స్వరూపమే మారిపోయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక హోటళ్లకు నేరుగా వచ్చే వారితో పోలిస్తే ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసే వారి సంఖ్య బాగా పెరిగింది. ఎప్పటికప్పుడు ఆఫర్లతో ఆకట్టుకుంటున్న ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు దానికి తగినట్లుగానే రెస్టారెంట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న హోటల్ యాజమాన్యాలు తాజాగా తమ నిరసన తెలిపాయి. దీనిపై యాప్‌ల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో తొలి దశలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీకి షాక్ ఇవ్వాలని నిర్ణయించాయి. నగరంలో పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని హోటల్ యాజమాన్యాలను విభజించు పాలించు పద్ధతిలో శాసిస్తున్న యాప్‌లకు అదే బాటలో షాక్ ఇవ్వాలని నిర్ణయించిన హోటళ్లు తొలుత స్విగ్గీ నుంచి బహిష్కరిస్తున్నాయి. పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోతే మిగతా యాప్‌ల పైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

   

  Pics : పాప్ డాన్సర్ యేనా ఇజోన్ అందమే అందం  ఇవి కూడా చదివేయండి :

  NDAకి శివసేన గుడ్‌బై... రాజీనామా చేసిన అరవింద్ సావంత్

  అయోధ్య తీర్పు తర్వాత ఎంత మంది అరెస్టయ్యారో తెలుసా...?

  జబర్దస్త్ రష్మీ, సుధీర్ మధ్య పెరిగిన గ్యాప్...? ఇవీ కారణాలు

  బెంగాల్‌పై బుల్‌బుల్ తుఫాను బీభత్సం... ఏడుగురు మృత్యువాత


  ఆర్టీసీ సమ్మెపై నేడు ఫైనల్‌గా తేల్చనున్న హైకోర్టు...
  First published: