మీ ఫొన్‌ను సింగిల్ హ్యాండ్‌తో పట్టుకుంటున్నారా... మీ జాతకం ఏంటంటే...

Mobile Astrology : రకరకాల పరిశోధనలతో ఆసక్తికర అంశాలు బయటికొస్తున్నాయి. తాజాగా మొబైల్‌ని ఎలా పట్టుకుంటున్నారన్న దాన్ని బట్టీ వాళ్ల ప్రవర్తన, వ్యవహార శైలిని తెలుసుకోవచ్చని తేలింది.

Krishna Kumar N | news18-telugu
Updated: December 20, 2019, 8:38 AM IST
మీ ఫొన్‌ను సింగిల్ హ్యాండ్‌తో పట్టుకుంటున్నారా... మీ జాతకం ఏంటంటే...
ప్రతీకాత్మక చిత్రం (File)
  • Share this:
మనుషుల బాడీ లాంగ్వేజ్‌ని బట్టీ వాళ్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆనందంగా ఉండేవారు... ఎక్కువగా కదులుతూ ఉంటారు. అదే బాధలో ఉండేవారు... దిగాలుగా కూర్చొని ఉంటారు. భయపడేవారు పెద్ద కళ్లతో అటూ ఇటూ చూస్తూ ఉంటారు. కాన్ఫిడెన్స్‌తో ఉంటే... స్థిమితంగా ఉంటారు. ఇలా మన ప్రవర్తనను బాడీ లాంగ్వేజ్ బయటపెడుతుంది. తాజాగా మొబైళ్లు కూడా మన రహస్యాల్ని చెప్పగలవని తేలింది. మొబైల్‌ని పట్టుకునే తీరును బట్టీ ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది సింగిల్ హ్యాండ్‌తో పట్టుకుంటారు. కొంతమంది రెండు చేతులతో పట్టుకుంటారు. ఇంకొంతమంది జస్ట్ వేళ్లతోనే ఆడిస్తుంటారు. మరి ఎవరి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకుందాం.

astrology, mobile astrology, best astrology, mobile astrology news, mobile apps, mobile app, mobile body language, astrology mobile app, moon astrology, మొబైల్ మనస్తత్వం, మొబైల్ టెక్నాలజీ, మొబైల్ మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్, మనస్తత్వ శాస్త్రం
ప్రతీకాత్మక చిత్రం (File)


వేళ్లతో మొబైల్ పట్టుకుంటే : సాధారణంగా ఫోన్‌ను చేతిలో పెట్టుకుంటారు చాలా మంది. కొందరు మాత్రం అది చేతిలోకి ఇమిడిపోకుండా కేవలం వేళ్లతో దాన్ని పట్టుకుంటారు. అలాంటి వాళ్లు జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఈజీగా ఎదుర్కోగలరట. వాళ్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంత తొందరగా ఎవరితోనూ ఎలాంటి స్నేహాలు, లింకులూ పెట్టుకోరు. ఐతే... ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఇలాంటి వాళ్లు అరుదుగా ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు.

astrology, mobile astrology, best astrology, mobile astrology news, mobile apps, mobile app, mobile body language, astrology mobile app, moon astrology, మొబైల్ మనస్తత్వం, మొబైల్ టెక్నాలజీ, మొబైల్ మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్, మనస్తత్వ శాస్త్రం
ప్రతీకాత్మక చిత్రం (File)


ఒక వేలుతో పనిచేసేవారు : కొంతమంది ఫోన్‌ను సింగిల్ ఫింగర్‌తో ఆపరేట్ చేస్తారు. కాల్ చెయ్యాలన్నా, స్క్రాల్ చెయ్యాలన్నా, టైపింగ్, చాటింగ్ అన్నీ సింగిల్ ఫింగర్‌తో చేసేస్తారు. అలాంటి వాళ్లు... చాలా సెన్సిటివ్. చాలా సైలెంట్ నేచర్‌తో ఉంచారు. వెంటనే కనెక్ట్ అవ్వడమే కాదు... అందరికీ నచ్చుతారు కూడా. బంధాలు, అనుబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందరితో కలిసిపోయి తమ వాళ్లలా మెలుగుతారని పరిశోధనల్లో స్పష్టమైంది.

astrology, mobile astrology, best astrology, mobile astrology news, mobile apps, mobile app, mobile body language, astrology mobile app, moon astrology, మొబైల్ మనస్తత్వం, మొబైల్ టెక్నాలజీ, మొబైల్ మైండ్ సెట్, బాడీ లాంగ్వేజ్, మనస్తత్వ శాస్త్రం
ప్రతీకాత్మక చిత్రం (File)


రెండు చేతుల వేళ్లతో ఆపరేట్ చేస్తే : వీళ్లు మరోటైపు. వీళ్లు మొబైల్‌ను అత్యంత జాగ్రత్తగా పట్టుకుంటారు. చెరో చేతిలోని చెరో వేలితో టైపింగ్. చాటింగ్, స్క్రాలింగ్ వంటివి ఏవైనా సరే... రెండు చేతులూ, రెండు వేళ్లూ ఉండాల్సిందే. వీళ్ల ప్లస్ పాయింట్ ఏంటంటో... ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోగలరు. అత్యంత జాగ్రత్త పరులు. ఏ పనైనా సరే దాన్ని పద్ధతిగా, కచ్చితత్వంతో చేస్తారు. పని పూర్తయ్యే వరకూ బాధ్యతగా తీసుకుంటారు. మైనస్ పాయింట్ ఏంటంటే... వీళ్లు పెద్దగా ఇతరులకు నచ్చరు. కారణం వీళ్లు ఎప్పుడూ రిజిడ్ (ధృడం)గా ఉంటారు. ఇతరుల జోలికి పోరు. ఎక్కువగా మాట్లాడరు. అందువల్ల వీళ్లతో ర్యాపో అనేది త్వరగా ఏర్పడదట.ఇప్పటివరకూ జరిపిన అధ్యయనాల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ దిశగా మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి కూడా చదవండి :

శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
Published by: Krishna Kumar N
First published: December 20, 2019, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading