సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

ప్రస్తుతం పేమెంట్స్ బ్యాంక్స్ 7.5% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అదే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మీకు లభించే వడ్డీ 5% మాత్రమే. కొన్ని బ్యాంకులు 6% నుంచి 6.25% ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే 3% లేదా 4% వడ్డీ మాత్రమే లభిస్తుంది.

news18-telugu
Updated: October 9, 2018, 1:40 PM IST
సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?
పేమెంట్స్ బ్యాంక్స్
  • Share this:
ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించారు. భారత తపాలా విభాగం ఆధ్వర్యంలో నడిచే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌(ఐపీపీబీ) ఇది. భారతదేశంలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ గురించి అందరికీ తెలుసు. పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ గురించి ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అసలు పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఏంటీ? సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌తో పోలిస్తే తేడాలేంటీ? ఏ బ్యాంక్ అకౌంట్ వల్ల లాభాలేంటీ? నష్టాలేంటీ? భారతదేశంలో రెగ్యులర్ బ్యాంకుల కన్నా కొత్తగా వచ్చిన 6 పేమెంట్స్ బ్యాంక్స్ వల్ల లాభాలు ఎక్కువా? తెలుసుకుందాం.

వడ్డీ రేట్లు

మీరు పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిస్తే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మీ సేవింగ్స్‌పై కనీసం 4% వడ్డీ లభిస్తుంది. అయితే ప్రస్తుతం పేమెంట్స్ బ్యాంక్స్ 7.5% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అదే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే మీకు లభించే వడ్డీ 5% మాత్రమే. కొన్ని బ్యాంకులు 6% నుంచి 6.25% ఆఫర్ చేస్తున్నాయి. ఒకవేళ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే 3% లేదా 4% వడ్డీ మాత్రమే లభిస్తుంది.

కనీస బ్యాలెన్స్
చాలావరకు పేమెంట్స్ బ్యాంక్స్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్‌ తెరిచే అవకాశమిస్తున్నాయి. అంటే వాటిలో అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు మినిమమ్ అమౌంట్ అవసరం లేదు. అదే బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్‌ తెరిస్తే మాత్రం బ్యాంకు నియమనిబంధనలకు అనుగుణంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కనీస బ్యాలెన్స్ విషయంలో ఒక్కో బ్యాంకు నియమాలు ఒక్కోలా ఉంటాయి.

గరిష్టంగా ఎంత దాచుకోవచ్చు?
పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత దాచుకోవచ్చన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. పేమెంట్స్ బ్యాంకులు గరిష్టంగా రూ.లక్ష వరకు దాచుకునే అవకాశమిస్తున్నాయి. ఒకవేళ పోస్ట్ ఆఫీసులో అకౌంట్ ఉంటే దాన్ని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు అనుసంధానం చేయొచ్చు. అందులో కూడా గరిష్టంగా రూ.లక్ష వరకు దాచుకోవచ్చు. ఒకవేళ సేవింగ్స్ అకౌంట్‌లో అయితే మీరు డబ్బులు దాచుకోవడానికి గరిష్ట పరమితి ఏమీ లేదు.ఏటీఎం/డెబిట్ కార్డులు
ఆర్‌బీఐ నియమనిబంధనల ప్రకారం పేమెంట్స్ బ్యాంకులు కూడా ఏటీఎం/డెబిట్ కార్డులు జారీ చేస్తాయి. పేమెంట్స్ బ్యాంకులు అకౌంట్ తెరవగానే డిజిటల్ కార్డులు జారీ చేస్తున్నాయి. మీరు కోరుకుంటే ఫిజికల్ కార్డులు కూడా జారీ చేస్తాయి. అయితే ప్రస్తుతానికి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు మాత్రమే ఏటీఎం/డెబిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఇక రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎలాగూ ఏటీఎం/డెబిట్ కార్డులు ఉంటాయి.

విత్‌డ్రాపై పరిమితులు
రెగ్యులర్ బ్యాంకులో మీరు ఎంచుకునే సేవింగ్స్ అకౌంట్‌ని బట్టి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి పరిమితులుంటాయి. సూచించిన దానికన్నా ఎక్కువసార్లు డ్రా చేసుకుంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్స్ బ్యాంకులో ఈ నియమనిబంధనలు కాస్త వేరుగా ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లాగా కొన్నిసార్లే ఉచిత విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఇస్తాయి. ఇంకొన్ని మాత్రం ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చో సూచిస్తాయి.

ఇంకా ఏఏ సేవలు పొందొచ్చు?
మీరు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిస్తే లోన్, ఓవర్‌డ్రాఫ్ట్, క్రెడిట్ కార్డ్ లాంటి సేవలు పొందొచ్చు. పేమెంట్స్ బ్యాంకులో కూడా ఈ సేవలు లభించవు. నిబంధనల ప్రకారం పేమెంట్స్ బ్యాంకులో లోన్, క్రెడిట్ కార్డు లభించవు. స్టేట్‌‌మెంట్స్, అకౌంట్ బ్యాలెన్స్, ఫండ్స్ ట్రాన్స్‌ఫర్స్ లాంటివన్నీ మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. పేమెంట్స్ బ్యాంక్స్‌లో అయితే ఎప్పటికప్పుడు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లభిస్తాయి.

మరి ఏ అకౌంట్ తీసుకోవాలి?
మీరు బ్యాంకింగ్ సేవల్ని పరిమితంగా ఉపయోగించుకోవాలన్నా... మీ పిల్లలకు బ్యాంకు అకౌంట్ గురించి తెలియజేయాలన్నా పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం మంచిది. బ్యాంకింగ్ సేవల్ని ఎక్కువగా వాడుకోవాలనుకుంటే మాత్రం పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

కారు కొంటున్నారా? ఎక్కువ డిస్కౌంట్ ఇలా పొందండి!

హెల్త్ ఇన్సూరెన్స్: ఈ 20 అంశాలు గుర్తుంచుకోండి!
First published: October 8, 2018, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading