SAVINGS ACCOUNTS UPDATE KOTAK MAHINDRA BANK AND FEDERAL BANK HIKE INTEREST RATES ON SAVINGS ACCOUNTS CHECK HERE GH MKS
Savings Accounts : ఆ బ్యాంకులో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? వడ్డీ రేట్లు పెరిగాయి తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
RBI ఒక నెలలోనే రెండుసార్లు రేట్లను పెంచింది. ఫలితంగా అనేక బ్యాంకులు లోన్ EMIలు, ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా రెండు బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.
గత వారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మళ్లీ 50 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ జీడీపీ అంచనాలను అనేక ఏజెన్సీలు సవరిస్తున్నాయి. ద్రవ్య సంస్థల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు రెపో రేటును పెంచుతున్నట్టు ఆర్బీఐ తెలిపింది. RBI ఒక నెలలోనే రెండుసార్లు రేట్లను పెంచింది. ఫలితంగా అనేక బ్యాంకులు లోన్ EMIలు, ఫిక్స్డ్ డిపాజిట్లు అలాగే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను పెంచాయి.
* కోటక్ మహీంద్రా బ్యాంక్ : సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు, వివిధ కాల వ్యవధికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ 9న ప్రకటించింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం జూన్ 13 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. రూ.50 లక్షల కంటే ఎక్కువ సేవింగ్స్ డిపాజిట్ నిల్వలపై సంవత్సరానికి 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ లభిస్తుంది. ఈ రేటు సంవత్సరానికి 3.5 శాతం ఉండగా.. తాజాగా 0.5 శాతం పెరిగి 4 శాతానికి చేరుకుంది.
కోటక్ వారి తాజా వడ్డీ రేట్లు: 1) రూ. 50 లక్షల వరకు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లకు: సంవత్సరానికి 3.5 శాతం. -2) రూ. 50 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో ఉండే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లకు: సంవత్సరానికి 4.00 శాతం 3) కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచింది.
* ఫెడరల్ బ్యాంక్ :ఆర్బీఐ రెపో రేటు పెంపు ఫలితంగా మరో ప్రైవేట్ రంగ రుణదాత అయిన ఫెడరల్ బ్యాంక్ కూడా సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్లు రెపో రేట్లతో అనుసంధానించి ఉన్న ఫలితంగా, T+1 ఆధారంగా RBI రెపో రేటును సవరించిన తర్వాత వడ్డీ రేట్లు మారుతాయని ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. తాజా వడ్డీ రేట్లు జూన్ 9 నుంచి అమలులోకి వచ్చాయి.
ఫెడరల్ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం: రూ. 5 కోట్ల కంటే తక్కువ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేటు RBI ప్రస్తుత రెపో రేటు కంటే 2.15 శాతం తక్కువగా ఉంది. అంటే ఇది 2.75 శాతంగా ఉంటుంది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉన్న సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ వడ్డీ రేటు RBI రెపో రేటు కంటే 2.15 శాతం తక్కువగా ఉంటుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.