హోమ్ /వార్తలు /బిజినెస్ /

Minimum Balance: బ్యాంక్ అకౌంట్‌లో కనీసం ఎంత బ్యాలెన్స్ ఉండాలి? లేకపోతే ఎంత చార్జీలు పడతాయి?

Minimum Balance: బ్యాంక్ అకౌంట్‌లో కనీసం ఎంత బ్యాలెన్స్ ఉండాలి? లేకపోతే ఎంత చార్జీలు పడతాయి?

Minimum Balance: బ్యాంక్ అకౌంట్‌లో కనీసం ఎంత బ్యాలెన్స్ ఉండాలి? లేకపోతే ఎంత చార్జీలు పడతాయి?

Minimum Balance: బ్యాంక్ అకౌంట్‌లో కనీసం ఎంత బ్యాలెన్స్ ఉండాలి? లేకపోతే ఎంత చార్జీలు పడతాయి?

Bank Account | మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? లేదంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖాతా కలిగి ఉన్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి. అకౌంట్‌లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలో చెక్ చేసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank Charges | బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. బ్యాంకులు కస్టమర్లకు వివిధ రకాల సేవింగ్ ఖాతాలను అందుబాటులో ఉంచాయి. మీరు ఎంచుకునే బ్యాంక్ (Bank) అకౌంట్ ప్రాతిపదికన మీకు లభించే బెనిఫిట్స్ కూడా మారతాయి. అందువల్ల బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ (Money) కలిగి ఉండాల్సిన పని లేదు. అయితే మరి కొన్నింటికి మాత్రం ఇది తప్పనిసరి. ఈ క్రమంలో మనం ఇప్పుడు ఏ ఏ బ్యాంక్‌లో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలో తెలుసుకుందాం.

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పని లేదు. ప్రస్తుతం బ్యాంక్ ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలను వసూలు చేయడం లేదు. మార్చి 2022 తర్వాత నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు అయితే నెలకు కనీసం రూ. 1000 నుంచి రూ. 3 వేల వరకు కలిగి ఉండాలి. ఈ బ్యాలెన్స్ లేకపోతే రూ. 5 నుంచి రూ. 15 వరకు చార్జీలు పడేవి.

సామాన్యులకు అదిరే శుభవార్త.. భారీగా దిగొచ్చిన వంట నూనె ధరలు!

ఐసీఐసీఐ బ్యాంక్‌లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిందే. మెట్రోలో రూ. 10 వేలు ఉండాలి. సెమీ అర్బన్ ఏరియాల్లో అయితే రూ. 5 వేల మినిమమ్ బ్యాలెన్స్ కావాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2 వేలు ఉండాలి. లేదంటే మాత్రం రూ. 500 వరకు పెనాల్టీ పడుతుంది.

బ్యాంకులకు ఈ వారం 3 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అయితే నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 10 వేలుగా ఉంది. పాక్షిక పట్టణాల్లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ రూ. 5 వేలుగా ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే క్వార్టర్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2,500గా ఉండాల్సిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో అయితే క్వార్టర్లీ మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2000గా ఉండాలి. సిటీలలో అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. అదే సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ అనేది రూ. 1000గా, రూ. 500 గా ఉంది. అందువల్ల బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాలను గుర్తించుకోవాలి. చార్జీలు ఎంతో ముందుగానే తెలుసుకుంటే.. అందుకు అనుగుణంగా బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయొచ్చు. లేదంటే మాత్రం పెనాల్టీలు పడతాయి. అప్పుడు బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతూ వస్తాయి.

First published:

Tags: Bank account, Banks, HDFC bank, Icici bank, Saving account, Sbi

ఉత్తమ కథలు