హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Account: పాన్ కార్డు అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్.. ఆ విషయంలో కస్టమర్లను హెచ్చరిస్తున్న బ్యాంక్!

Bank Account: పాన్ కార్డు అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్.. ఆ విషయంలో కస్టమర్లను హెచ్చరిస్తున్న బ్యాంక్!

Bank Account: పాన్ కార్డు అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్.. ఆ విషయంలో కస్టమర్లను హెచ్చరిస్తున్న బ్యాంక్

Bank Account: పాన్ కార్డు అప్‌డేట్ చేయకపోతే అకౌంట్ క్లోజ్.. ఆ విషయంలో కస్టమర్లను హెచ్చరిస్తున్న బ్యాంక్

PAN Card | బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి అలర్ట్. మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేయడానికి మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారు. వీటితో జాగ్రత్తగా ఉండాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

HDFC Bank | బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే కచ్చితంగా పాన్ కార్డు అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మాత్రం మీ బ్యాంక్ (Bank) అకౌంట్ క్లోజ్ అవుతుంది. వెంటనే ఈ లింక్‌పై క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోండి. పాన్ కార్డు (Pan Card) అప్‌డేట్ చేసుకోండి. అని ఇలాంటి మెసేజ్ మీకు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇందులో నిజం లేదు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు కస్టమర్లను కోరుతున్నాయి.

ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తన కస్టమర్లను ఈ విషయంపై అలర్ట్ చేసింది. ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను కోరుతోంది. అందువల్ల మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చి ఉంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మెసేజ్‌లో ఉన్న లింక్స్‌పై క్లిక్ చేయవద్ద.

లోన్ తీసుకునే వారికి బ్యాంక్ అదిరే శుభవార్త.. రుణ రేట్లు భారీగా తగ్గింపు, చార్జీలు మాఫీ!

మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్లను బురిడీ కొట్టించడానికి ఈ తరహా మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. పొరపాటుగా బ్యాంక్ నుంచి ఈ మెసేజ్ వచ్చిందని భావిస్తే.. మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని కంగారు పడి లింక్‌పై క్లిక్ చేసి వివరాలు అందిస్తే.. మీ బ్యాంక్ అకౌంట్ వెంటనే ఖాళీ అయిపోతుంది. అందువల్ల మీరు ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండండి.

ఈ ఎల్‌ఐసీ పాలసీతో రూ.76 లక్షలు మీవే.. లోన్ కూడా ఇస్తారు!

మీ బ్యాంక్ అకౌంట్ పని చేయదు. క్లోజ్ అవుతుంది. వెంటనే పాన్ కార్డుతో అప్‌డేట చేసుకోండి. ఈ లింక్‌పై క్లిక్ చేసి వెంటనే పని పూర్తి చేసుకోండి అంటూ మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఎస్‌బీఐ , హెచ్‌డీఎఫ్‌సీ సహా ఇతర బ్యాంకులు కస్టమర్లకు కూడా ఈ మెసేజ్‌లు రావొచ్చు. అందువల్ల ఇలా మెసేజ్ వస్తే.. వాటికి స్పందించవద్దు. వెంటనే డిలేట్ చేసేయండి. ఇబ్బంది ఏమీ ఉండదు. మోసపూరిత మెసేజ్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేస్తే.. బ్యాంక్‌ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇది అచ్చం బ్యాంక్ వెబ్‌సైట్ మాదిరిగానే ఉంటుంది. కానీ బ్యాంక్ వెబ్‌సైట్ మాత్రం కాదు. ఇది పూర్తి ఫేక్.

మోసగాళ్లు బ్యాంక్‌ను పోలిన విధంగానే నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేస్తారు. మీరు లింక్‌పై క్లిక్ చేస్తే బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇది ఫేక్ సైట్. మీరు మీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు ఎంటర్ చేయగానే ఆ డేటాను మోసగాళ్లు తస్కరిస్తారు. దాని సాయంతో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. మీ అకౌంట్ ఖాళీ అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి ఫేక్ మెసేజ్‌లకు స్పందించవద్దు.

First published:

Tags: Bank account, Banks, HDFC bank, PAN card, Saving account, Sbi

ఉత్తమ కథలు