హోమ్ /వార్తలు /బిజినెస్ /

Interest Rate Hike: PPF, ఇతర స్మాల్ సేవింగ్స్‌ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెరుగుతాయా? నిపుణుల అభిప్రాయాలు ఇవే..

Interest Rate Hike: PPF, ఇతర స్మాల్ సేవింగ్స్‌ స్కీమ్స్ వడ్డీ రేట్లు పెరుగుతాయా? నిపుణుల అభిప్రాయాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Interest Rate Hike: ప్రస్తుతం ఎన్ని రకాల స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటిపై ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసుకుందాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్మాల్‌ సేవింగ్స్‌ (Small Savings) డిపాజిట్‌ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌. ఈ పథకాల వడ్డీ రేట్లు (Interest Rates) త్వరలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. ప్రభుత్వ సెక్యూరిటీలపై కూడా రాబడి పెరగడంతో.. స్మాల్ సేవింగ్స్‌ స్కీముల వడ్డీ రేట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని రకాల స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటిపై ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసుకుందాం.

* చివరిసారిగా 27 నెలల క్రితం సవరణ

ప్రభుత్వం స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీములపై వడ్డీ రేట్లు చివరిసారిగా 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సవరించింది. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 27 నెలలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్ ఇప్పటికే 7.3 శాతం దాటిందని హిందుస్థాన్ టైమ్స్ బిజినెస్ పబ్లికేషన్ లైవ్ మింట్ పేర్కొంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), ఇతర స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీముల వడ్డీ రేట్లను త్రైమాసికానికి ఒకసారి సమీక్షిస్తారు. దీంతో ఈ నెలాఖరున స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీముల వడ్డీ రేట్లకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారు.

* ప్రభుత్వ సెక్యూరిటీల ప్రభావం

SAG ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గుప్తా లైవ్ మింట్‌తో మాట్లాడుతూ.. స్మాల్ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీముల్లో పెట్టుబడులకు, ప్రభుత్వ సెక్యూరిటీ రాబడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల పెరుగుదల పీపీఎఫ్‌పై వడ్డీ రేటును పెంచుతుందని, స్మాల్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీముల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల సేవింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని గ్రాంట్ థార్న్‌టన్ భారత్‌కు చెందిన వివేక్ అయ్యర్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వడ్డీరేట్లను పెంచాలని మానిటరీ పాలసీ డిమాండ్ చేస్తుందని చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి తగ్గుతోందని, ఈ సందర్భంలో PPF రేట్లను పెంచడం సరైన నిర్ణయమని అయ్యర్ అభిప్రాయపడ్డారు.

* ప్రస్తుత వడ్డీ రేట్లు

స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, కిసాన్ వికాస్ పత్ర, టైమ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన ఉన్నాయి. ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేట్లు 6.8 శాతంగా ఉంది. ఒక సంవత్సరం కాల వ్యవధికి చేసే డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ అందుతుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్‌పై వడ్డీ రేటు 7.4 శాతం, సుకన్య సమృద్ధి యోజన 7.6 శాతంగా ఉన్నాయి. సేవింగ్స్‌ డిపాజిట్ వడ్డీ రేటు నాలుగు శాతంగా ఉంది. అయితే 1-5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.5 నుంచి 6.7 శాతం మధ్య ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీల రాబడి పెరగడంతో, స్మాల్‌ సేవింగ్స్‌ స్కీముల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని గుప్తా తెలిపారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Money savings, Personal Finance, PPF, Small saving

ఉత్తమ కథలు