Credit Card News | క్రెడిట్ కార్డుతో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. డిస్కౌంట్ల, క్యాష్‌బ్యాక్, రివార్డు పాయింట్లు, వడ్డీ రహిత క్రెడిట్, ఈజీ ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ (EMI) వంటి బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కూడా ఇలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఒక్కో కార్డుపై ఒక్కో టైమ్‌లో ఆఫర్లు అందుబాటులో ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఒక క్రెడిట్ కార్డుపై (Credit Card) అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు వాడే వారికి సూపర్ ఆఫర్ లభిస్తోంది. రూ. 5 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసి ఈ ప్రయోజనం పొందొచ్చు. మినిమమ్ ట్రాన్సాక్షన్ విలువ రూ. 10 వేలు ఉండాలి. గరిష్టంగా రూ. 5 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. డిసెంబర్ 18 వరకే ఈ డీల్ సొంతం చేసుకోగలం.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 రోజుల్లోనే తల్లకిందులు!
అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి కూడా ఆఫర్లు ఉన్నాయి. వీరికి కూడా రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తోంది. దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ షావోమి తాజాగా నెం 1 ఎంఐ ఫ్యాన్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారు రూ. 5 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ, డెబిట్కార్డు లావాదేవీలకు కూడా ఇది వర్తిస్తుంది.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. 2 రోజుల్లోనే తల్లకిందులు!
ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తోంది. అదేసమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్దుపై కూడా ఇలాంటి ఆఫర్‌నే సొంతం చేసుకోవచ్చు. రూ. 1,000 వరకు తక్షణ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కేవలం క్రెడిట్ కార్డులకు మాత్రమే కాకుండా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల డెబిట్ కార్డులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కేవలం ఆఫర్లు మాత్రమే కాకుండా ఈ బ్యాంకులు పలు ఇతర బ్రాండ్లపై కూడా ఆఫర్లు అందిస్తున్నాయి. ఈజీ ఈఎంఐ ఆప్షన్లు కూడా సొంతం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Credit card, HDFC bank, Icici bank, Sbi