SAVE RS 95 PER DAY IN GRAM SUMANGAL RURAL POSTAL LIFE INSURANCE SCHEME AND GET UP TO RS 14 LAKH RETURNS SS
Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌తో రూ.14 లక్షల రిటర్న్స్... ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా
Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌తో రూ.14 లక్షల రిటర్న్స్... ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా
(ప్రతీకాత్మక చిత్రం)
Post Office Scheme | పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో డబ్బులు పొదుపు (Money Saving Tips) చేయాలనుకుంటున్నారా? ఓ స్కీమ్‌లో రూ.95 పొదుపు చేసి రూ.14 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోండి.
జీతం రాగానే కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటున్నారా? భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకోవడంతో పాటు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా పొందాలని అనుకుంటున్నారా? పోస్ట్ ఆఫీస్‌లో ఓ అద్భుతమైన స్కీమ్ ఉంది. దాచుకున్న డబ్బులకు మంచి రిటర్న్స్ రావడంతో పాటు... ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ పేరు గ్రామ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ (Gram Sumangal Rural Postal Life Insurance Scheme). పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గ్రామ్ సుమంగళ్ అకౌంట్లో రోజూ రూ.95 పొదుపు చేయడం ద్వారా రూ.14 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 20 ఏళ్ల టెన్యూర్‌తో గ్రామ సుమంగళ్ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. సమ్ అష్యూర్డ్ రూ.7,00,000 లక్షలు అనుకుంటే నెలకు రూ.2,853 చెల్లించాలి. అంటే రోజుకు రూ.95 చొప్పున చెల్లిస్తే చాలు. ఇది మనీబ్యాక్ స్కీమ్ కాబట్టి 8, 12, 16 ఏళ్లల్లో 20 శాతం చొప్పున మనీ బ్యాక్ లభిస్తుంది. అంటే ప్రతీసారి రూ.1,40,000 చొప్పున మనీ బ్యాక్ వస్తుంది. 20వ సంవత్సరంలో మిగతా రూ.2,80,000 మొత్తం లభిస్తుంది.
పాలసీ నిబంధనల ప్రకారం ప్రతీ వెయ్యి రూపాయలకు రూ.48 చొప్పున యాన్యువల్ బోనస్ లభిస్తుంది. అంటే రూ.7,00,000 సమ్ అష్యూర్డ్‌కు రూ.3,36,00. బోనస్ లభిస్తుంది. పాలసీ 20 ఏళ్లు కొనసాగిస్తే మొత్తం రూ.13.72 లక్షల బెనిఫిట్స్ వస్తాయి. ముందే రూ.4,20,000 మనీబ్యాక్ రూపంలో వస్తుంది కాబట్టి మిగతా రూ.9,52,000 మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది.
గ్రామ సుమంగళ్ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. కనీస వయస్సు 19 ఏళ్లు. గరిష్ట వయస్సు చూస్తే 20 ఏళ్ల పాలసీకి 40 ఏళ్లు, 15 ఏళ్ల పాలసీకి 45 ఏళ్లు. అంటే వయస్సు 60 ఏళ్లు పూర్తయ్యేనాటికి పాలసీ పూర్తవుతుంది. మనీబ్యాక్ వివరాలు చూస్తే 15 ఏళ్ల పాలసీకి 6, 9, 12 సంవత్సరాల్లో 20 శాతం చొప్పున, మిగతా మొత్తం మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీకి 8, 12, 16 సంవత్సరాల్లో 20 శాతం చొప్పున, మిగతా మొత్తం మెచ్యూరిటీ సమయంలో లభిస్తుంది.
ఇది ఇన్స్యూరెన్స్ పాలసీ కాబట్టి పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతుండగానే మరణిస్తే సమ్ అష్యూర్డ్ నామినీకి లభిస్తుంది. సమ్ అష్యూర్డ్‌తో పాటు అప్పటివరకు బోనస్ కూడా లెక్కించి చెల్లిస్తారు. పోస్ట్ ఆఫీసులో ఇలాంటి పొదుపు పథకాలు చాలా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో డబ్బులు పొదుపు చేయాలనుకునేవారికి ఈ పథకాలను పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.