Pension Scheme: రోజూ రూ.7 పొదుపు చేసి ఏటా రూ.60,000 పొందండి

Pension Scheme: రోజూ రూ.7 పొదుపు చేసి ఏటా రూ.60,000 పొందండి (ప్రతీకాత్మక చిత్రం)

Pension Scheme | మీరు ఏదైనా పొదుపు పథకంలో చేరాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను, పెన్షన్ స్కీమ్స్‌ని అందిస్తోంది. అందులో ఓ పొదుపు పథకంలో రోజుకు రూ.7 పొదుపు చేస్తే ఏటా రూ.60,000 పొందొచ్చు.

  • Share this:
    అటల్ పెన్షన్ యోజన-APY ద్వారా ఇది సాధ్యం. రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 పొదుపు చేస్తే చాలు. రిటైర్మెంట్ వయస్సు నుంచి నెలకు రూ.5,000 చొప్పున ఏటా రూ.60,000 పెన్షన్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకాల్లో అటల్ పెన్షన్ యోజన-APY బాగా పాపులర్ అయింది. ఇక ఇటీవల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరేవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా అండగా ఉండేందుకు పెన్షన్ కోరుకునేవారు ఇప్పటి నుంచే ఈ పథకంలో పొదుపు చేస్తే చాలు. రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్‌డ్ పెన్షన్ వస్తుంది.

    కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ లాంటి పెన్షన్ స్కీమ్స్‌లో లేని అసంఘటిత రంగ కార్మికుల కోసం రూపొందించిన పథకం ఇది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 40 ఏళ్లు. ఎప్పుడు ఈ స్కీమ్‌లో చేరినా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ స్కీమ్‌లో డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ప్రతీ నెల కనీసం రూ.42 నుంచి పొదుపు చేయొచ్చు. గరిష్టంగా రూ.1,454 పొదుపు చేయొచ్చు. ఈ స్కీమ్‌లో కనీస పెన్షన్ రూ.1,000 లభిస్తుంది. గరిష్టంగా నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది.

    SBI KYC fraud: కేవైసీ మోసాలు నిజమే... ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్న ఎస్‌బీఐ

    IFSC Codes: ఖాతాదారులకు అలర్ట్... ఈ బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మారాయి

    ఖాతాదారులు జమ చేసే మొత్తాన్ని బట్టి నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. 18 ఏళ్ల వయస్సు ఉన్నవారు రూ.1,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.42 చొప్పున, రూ.2,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.84 చొప్పున, రూ.3,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.126 చొప్పున, రూ.4,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.168 చొప్పున, రూ.5,000 పెన్షన్ కావాలంటే నెలకు రూ.210 చొప్పున జమ చేయాలి. నెలకు రూ.210 అంటే రోజుకు రూ.7 పొదుపు చేస్తే చాలు. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు.

    Currency Note: ఈ మూడు పాత నోట్లు మీ దగ్గరున్నాయా? రూ.1,00,000 మీవే

    Stock Market: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రూ.26,000 లాభం

    అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరడం చాలా సులువు. ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో అటల్ పెన్షన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ స్కీమ్‌ను అందిస్తున్నాయి. వీటితో పాటు పోస్ట్ ఆఫీస్, రీజనల్ రూరల్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేమెంట్ బ్యాంక్, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకుల్లో కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరొచ్చు. స్కీమ్‌లో చేరిననాటి నుంచి క్రమం తప్పకుండా డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఆరు నెలల పాటు డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. 12 నెలల తర్వాత డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: