హోమ్ /వార్తలు /బిజినెస్ /

LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే

LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)

LIC Policy | ఓ ఎల్ఐసీ పాలసీలో ప్రతీ రోజు రూ.200 పొదుపు చేస్తే రూ.28,00,000 వరకు రిటర్స్ పొందొచ్చు. ఎల్ఐసీ జీవన్ ప్రగతి (LIC Jeevan Pragati) పాలసీ వివరాలు తెలుసుకోండి.

మీరు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీతో మంచి రిటర్న్స్ పొందొచ్చు. రోజూ రూ.200 చొప్పున దాచుకుంటే చాలు... మీరు రూ.28 లక్షల రిటర్న్స్ పొందొచ్చు. అంతేకాదు... రూ.15,000 పైనే పెన్షన్ కూడా లభిస్తుంది. ఇందులో మీరు ఏ సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకుంటే గడువు ముగిసే నాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది. ఇది నాన్ లింక్డ్, ఎండోమెంట్ పాలసీ. సేవింగ్స్‌తో పాటు బీమా కూడా లభిస్తుంది.

సమ్ అష్యూర్డ్ రెట్టింపు


ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీ తీసుకుంటే ప్రతీ ఐదేళ్లకు ఓసారి సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. మొదటి 5 ఏళ్లు సమ్ అష్యూర్డ్ మొదట తీసుకున్నట్టుగానే ఉంటుంది. ఆ తర్వాత 6 నుంచి 10 ఏళ్లలో 25 శాతం నుంచి 125 శాతం వరకు పెరుగుతుంది. 11 నుంచి 15 ఏళ్లలో 150 శాతం పెరుగుతుంది. 16 నుంచి 20 ఏళ్లలో 200 శాతం సమ్ అష్యూర్డ్ అవుతుంది. డెత్ బెనిఫిట్ వివరాలు చూస్తే పాలసీహోల్డర్ మరణిస్తే సమ్ అష్యూర్డ్, సింపుల్ రవిజనరీ బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ నామినీకి లభిస్తాయి.

SBI ATM Card: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు ఉందా? లక్ష రూపాయల లోన్ ఇస్తున్న బ్యాంక్

ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.2 లక్షలు సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకుంటే మొదటి 5 ఏళ్లు సమ్ అష్యూర్డ్ రూ.2,00,000 ఉంటుంది. 6 నుంచి 10 ఏళ్లకు రూ.2,50,000 సమ్ అష్యూర్డ్ ఉంటుంది. అలాగే 11 నుంచి 15 ఏళ్లకు రూ.3,00,000 సమ్ అష్యూర్డ్, 16 నుంచి 20 ఏళ్లకు రూ.4,00,000 సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. అంటే పాలసీ ముగిసేనాటికి సమ్ అష్యూర్డ్ రెట్టింపు అవుతుంది.

SBI Alert: సంవత్సరానికి ఓసారి రూ.342 చెల్లిస్తే చాలు... రూ.4,00,000 విలువైన బెనిఫిట్స్

రూ.28,00,000 రిటర్న్స్


ఎల్ఐసీ జీవన్ ప్రగతి పాలసీని 12 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారు తీసుకోవచ్చు. పాలసీ ప్రీమియం 12 నుంచి 20 ఏళ్ల వరకు చెల్లించొచ్చు. కనీసం రూ.1,50,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోవాలి. ఈ పాలసీలో యాక్సిడెంటల్ డెత్, డిసేబిలిటీ రైడర్ లాంటివి ఉంటాయి. ఈ పాలసీలో రోజూ రూ.200 చొప్పున 15 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే రూ.15,00,000 రిటర్న్స్ లభిస్తాయి. 20 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే రూ.28,00,000 రిటర్న్స్ లభిస్తాయి. అంటే నెలకు రూ.6,000 చొప్పున ప్రీమియం చెల్లిస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.28 లక్షల వరకు డబ్బులు పొందొచ్చు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: LIC, Personal Finance

ఉత్తమ కథలు