హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Scheme: రిస్క్ లేకుండా మీ డబ్బుల్ని రెట్టింపు చేసే స్కీమ్ ఇది

Savings Scheme: రిస్క్ లేకుండా మీ డబ్బుల్ని రెట్టింపు చేసే స్కీమ్ ఇది

Savings Scheme: రిస్క్ లేకుండా మీ డబ్బుల్ని రెట్టింపు చేసే స్కీమ్ ఇది
(ప్రతీకాత్మక చిత్రం)

Savings Scheme: రిస్క్ లేకుండా మీ డబ్బుల్ని రెట్టింపు చేసే స్కీమ్ ఇది (ప్రతీకాత్మక చిత్రం)

Savings Scheme | ఏ పెట్టుబడి మార్గం ఎంచుకున్నా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కానీ ప్రభుత్వ పొదుపు పథకాల్లో (Govt Savings Schemes) రిస్క్ ఉండదు. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బును పొదుపు చేసి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా? భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బు పెద్దమొత్తంలో ఉందా? మీ డబ్బును ఎలాంటి రిస్క్ లేకుండా రెట్టింపు చేసే ప్రభుత్వ పొదుపు పథకాలు (Government Savings Schemes) ఉన్నాయి. అందులో కిసాన్ వికాస్ పత్ర (KVP) పొదుపు పథకం కూడా ఒకటి. ఈ పథకాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ నిర్వహిస్తోంది. ఏదైనా పోస్ట్ ఆఫీసులో ఈ పథకంలో (Post Office Scheme) చేరొచ్చు. ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రిస్కు లేకుండా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీరు దాచుకున్న మొత్తానికి గ్యారెంటీ రిటర్న్స్ పొందొచ్చు.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో 2022 సెప్టెంబర్ నాటికి 6.9 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకు ఓసారి సవరిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ వడ్డీ రేట్లు పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే డబ్బులు దాచుకున్నవారికి ఎక్కువ లాభం ఉంటుంది.

DigiLocker: డిజీలాకర్‌లో మీ నామినీ పేరు యాడ్ చేయండి ఇలా

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో కనీసం రూ.1000 డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. 124 నెలలు అంటే 10 ఏళ్ల 4 నెలల పాటు డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. పూర్తి కాలం మీ డబ్బును పొదుపు చేస్తే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ ప్రకారం లెక్కిస్తారు కాబట్టి ఖాతాదారులకు అధిక ప్రయోజనం ఉంటుంది.

డబ్బు రెట్టింపు అయ్యేది ఇలా

ఉదాహరణకు కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో మీరు రూ.5,00,000 పొదుపు చేశారనుకుందాం. 6.9 శాతం వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.10,00,000 రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ మీరు రూ.50 లక్షలు పొదుపు చేస్తే రూ.1 కోటి రిటర్న్స్ లభిస్తాయి. రిటర్న్స్ ఎక్కువ రావాలంటే పూర్తి కాలం పొదుపు చేయాల్సి ఉంటుంది.

Pension Scheme: అక్టోబర్ 1 నుంచి వీరికి ఈ పెన్షన్ స్కీమ్ వర్తించదు

కిసాన్ వికాస్ పత్ర పథకంలో ఎవరైనా చేరొచ్చు. ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్ల లోపు మైనర్ల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అయితే ఈ పథకంలో ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం పన్ను ఆదా చేయడానికి డబ్బు పొదుపు చేయాలనుకుంటే ఈ పథకం అంత ప్రయోజనకరం కాదు. పన్ను ఆదా చేయడానికి ఇందుకోసం ఇతర పథకాలు ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Kisan vikas patra, Personal Finance, Post office scheme, Small saving

ఉత్తమ కథలు