హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Scheme: నెలకు రూ.1,000 చెల్లిస్తే చాలు... రూ.5 లక్షలకు పైనే రిటర్న్స్

Savings Scheme: నెలకు రూ.1,000 చెల్లిస్తే చాలు... రూ.5 లక్షలకు పైనే రిటర్న్స్

Savings Scheme: నెలకు రూ.1,000 చెల్లిస్తే చాలు... రూ.5 లక్షలకు పైనే రిటర్న్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Savings Scheme: నెలకు రూ.1,000 చెల్లిస్తే చాలు... రూ.5 లక్షలకు పైనే రిటర్న్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Savings Scheme | కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఓ పొదుపు పథకంలో (Savings Scheme) నెలకు రూ.1,000 చొప్పున 15 ఏళ్లు పొదుపు చేస్తే చాలు. మెచ్యూరిటీ సమయంలో రూ.5 లక్షల కన్నా ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకాల్లో కొన్ని పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) ఒకటి. తల్లిదండ్రులు తమ ఆడ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే పొదుపు చేయాలంటే ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఆడపిల్లల పైచదువులు, పెళ్లిళ్ల కోసం డబ్బు పొదుపు (Money Saving) చేయాలనుకునే తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఎంచుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. ఇటీవల జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ రేట్లు వస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాత్రమే కాదు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలతో పోల్చి చూసినా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ.

సుకన్య సమృద్ధి యోజన ఎవరికి?


సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఆడపిల్లల పేరు మీదే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. 10 ఏళ్ల లోపు అమ్మాయి పేరు మీద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తనే అకౌంట్ హోల్డర్ అవుతారు. ఒక కుటుంబం గరిష్టంగా ఇద్దరు అమ్మాయిల పేర్ల మీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఒక వేళ కవలలు, ట్రిప్లెట్స్ పుట్టినట్టైతే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు.

LIC Policy: ఎల్ఐసీ నుంచి కోటి రూపాయల పాలసీ... ప్రీమియం ఎంతంటే

సుకన్య సమృద్ధి యోజన ఎలా ఓపెన్ చేయాలి?


సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను పోస్ట్ ఆఫీసులో లేదా బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు. ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో 15 ఏళ్ల పాటు పొదుపు చేయాలి. మెచ్యూరిటీ 21 ఏళ్లకు ఉంటుంది. కనీసం రూ.250 డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఏడాదికి రూ.250 నుంచి రూ.1,50,000 మధ్య జమ చేయొచ్చు. నెలకోసారి లేదా మొత్తం ఒకేసారి పొదుపు చేయొచ్చు. ఒకవేళ గడువులోగా డబ్బులు పొదుపు చేయకపోతే రూ.50 జరిమానా చెల్లించాలి. డిఫాల్ట్ అయిన అకౌంట్‌ను పునరుద్ధరించుకోవచ్చు. డిఫాల్ట్ అకౌంట్లు పునరుద్ధరించడానికి ఏడాదికి రూ.250 + రూ.50 చెల్లించాలి.

LIC: ఎల్ఐసీ దగ్గర మీ పాలసీ డబ్బులున్నాయా? ఇలా క్లెయిమ్ చేసుకోండి

సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలు


సుకన్య సమృద్ధి యోజన పథకానికి జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి 7.6 వడ్డీ రేటు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయంలో వడ్డీ జమ అవుతుంది. జమ చేసిన మొత్తానికి, వడ్డీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు పొందొచ్చు. ఉదాహరణకు ఎవరైనా తమ కూతురు పుట్టగానే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేసి ప్రతీ నెలా రూ.1,000 చొప్పున జమ చేస్తే ఏడాదికి రూ.12,000 జమ చేయాల్సి ఉంటుంది. 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.1,80,000 అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చూస్తే మొత్తం రూ.3,47,445 వడ్డీ లభిస్తుంది. అమ్మాయికి 21 ఏళ్లు పూర్తైన తర్వాత అసలు + వడ్డీ కలిపి మొత్తం రూ.5,27,445 లభిస్తుంది.

First published:

Tags: Personal Finance, Save Money, Sukanya samriddhi yojana

ఉత్తమ కథలు