• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • SATYA NADELLA GOT MORE POWER IN MICROSOFT HE APPOINTED S NW CHAIRMAN SK

Satya Nadella: సత్య నాదెళ్ల మరో ఘనత.. మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా ఎన్నిక

సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో థామ్సన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు థామ్సన్ స్థానంలో సత్యనాదెళ్ల బాధ్యతలు చేపట్టబోతున్నారు

  • Share this:
    తెలుగు తేజం, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మరో ఘనత సాధించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఆయన అధికార బాధ్యతలు మరింత పెరిగాయి. ప్రస్తుత సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. తాజాగా ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా సత్య నాదెళ్లను నియమిస్తుస్తున్నట్లు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. బోర్డు ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఛైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉంటారు. 1975లో మైక్రో సాఫ్ట్‌లో చేరిన తర్వాత మైక్రోసాఫ్ట్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఇక 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కంపెనీని కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు సత్య నాదెళ్లల. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆపిల్, గూగుల సంస్థలకు పోటీగా మొబైల్ రంగపైనా దృష్టిసారించారు.

    2014 నుంచి సత్య నాదెళ్ల మైక్రో సాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్నారు. ఏడేళ్ల క్రితం స్టీవ్ బామర్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్‌లో కీలక భాగంగా ఉన్న లింక్డ్‌‌ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు జెనీమ్యాక్స్ బిజినెస్ వ్యవహారాలను కూడా సత్య నాదెళ్లే చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 2014లో ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో థామ్సన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు థామ్సన్ స్థానంలో సత్యనాదెళ్ల బాధ్యతలు చేపట్టబోతున్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు సత్యానాదెళ్ల ట్విటర్ ద్వారా అభినందను తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.




    కాగా, గత ఏడాది మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ తప్పుకున్నారు. తన భార్య మిలిండాతో కలిసి ఏర్పాటు చేసిన 'బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌' నిర్వహించే ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారించేందుకే మైక్రో సాఫ్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. కానీ అందులో నిజం లేదని అంతర్జాతీయ వార్తా సంస్థ కథనాలను ప్రచురించాయి. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగితో కొన్నేళ్ల క్రితం బిల్‌ గేట్స్‌ లైంగిక సంబంధాలు కొనసాగించారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ఓ న్యాయ సంస్థతో విచారణ చేయించిందని సంచలన కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏకంగా బిల్ గేట్స్ దంపతులు వీడిపోయారు. తమ మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఈ జంట విడిపోయిందన్న వార్త గత నెలలో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published: