Napkins | శానిటరీ ప్యాడ్స్ వాడే వారికి అలర్ట్. ఒక షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ) టాక్సిక్స్ లింక్ నిర్వహించిన ఒక అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారత దేశంలోని పాపులర్ శానిటరీ నాప్కిన్ (Sanitary Pads) బ్రాండ్లలో హానికరమైన రసాయనాలు ఉన్నట్లు టాక్సిక్స్ లింక్ తెలిపింది. వీటి వద్ద క్యాన్సర్ (Cancer) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా వంధ్యత్వం కూడా సంభవింవొచ్చని తెలియజేసింది. అంటే పిల్లలు పుట్టకపోవచ్చు.
టాక్సిక్స్ లింక్ ప్రకారం చూస్తే.. భారతీయ మార్కెట్లో విక్రయించే ఆర్గానిక్, అకర్బన శానిటరీ ప్యాడ్లలో థాలేట్స్, వీఓసీలు వంటి విషపూరిత రసాయనాలు వంటివి ప్రముఖ శానిటరీ ప్యాడ్లలో ఉన్నాయి. ఫ్లెక్సిబిలిటీ, పారదర్శకత, మన్నిక వంటి వాటిని పెంచడం కోసం ప్లాస్టిక్‌కు థాలేట్స్‌ను కలుపుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్సీబీఐ) ప్రకారం.. థాలేట్స్ అనేది యుక్తవయస్సులో మార్పులను ప్రేరేపిస్తుంది. క్యాన్సర్, సంతానోత్పత్తి లోపాలకు కారణం అవుతుంది. టెస్టిక్యులర్ డిస్జెనిసిస్ సిండ్రోమ్‌కు దారితీస్తుంది. మగవారు, మహిళలు ఇద్దరిలోనూ దీని వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది.
కస్టమర్లకు ఒకేసారి 2 శుభవార్తలు అందించిన బజాజ్ ఫైనాన్స్!
మరో నివేదిక ప్రకారం చూస్తే.. థాలేట్స్ వల్ల ఆస్తమా, ఏకాగ్రత కోల్పోవడం, హైపర్యాక్టివిటీ డిజార్డర్, రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, తక్కువ ఐక్యూ సహా మరెన్నో రుగ్మతలు సంభవిస్తాయి. అంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే శానిటరీ ప్యాడ్లలో కనిపించే ఇతర రసాయనం వీఓసీలు. వీటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ 2 కీలక నిర్ణయాలు.. వారికి అదిరే శుభవార్త!
శానిటరీ ప్యాడ్లలో కనిపించే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOC) వల్ల కళ్ళు, ముక్కు, గొంతు వంటి వాటిపై ఇరిటేషన్ రావొచ్చు. వికారం, అలసట, సమన్వయం కోల్పోవడం, మైకం వంటివి సంభవింవొచ్చు. కాలేయం, మూత్రపిండాలు, కేంద్ర నాడీ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. క్యాన్సర్‌కు కూడా కారణం కావొచ్చు. అందువల్ల ఈ రెండు కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలి.
కేవలం శానిటరీ ప్యాడ్స్‌లో మాత్రమే కాకుండా ఈ హానికర కెమికల్స్ ఇతర ప్రొడక్టుల్లోనూ ఉన్నాయని అధ్యయనంలో తేలింది. పెయింట్స్, డియోడరెంట్లు, ఎయిర్ ఫ్రెషనర్లు, నెయిల్ పాలిష్ వంటి అనేక ఇతర ఉత్పత్తులలో రెండు హానికరమైన రసాయనాలు కనిపిస్తాయి. అయితే శానిటరీ ప్యాడ్లలో ఈ రసాయనాల వల్ల ఎక్కువ ప్రమాదం సంభవించొచ్చు. సాయనాలు సులభంగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం.. 15- 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన దాదాపు 64 శాతం మంది మహిళలు శానిటరీ ప్యాడ్లను ఉపయోగిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breast cancer, Cancer, Women