దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్సంగ్.. 'శామ్సంగ్ నౌ' అనే ఓ లైవ్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ను శామ్సంగ్.కామ్‌లో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కొత్తగా లాంచ్ చేసిన ఫోల్డబుల్ మొబైల్స్ కోసం తొలిసారిగా భారతీయ యూజర్లకు లైవ్ ప్రీ-బుక్ ఈవెంట్‌ని అందుబాటులోకి తేనుంది. శామ్సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 5G, గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G స్మార్ట్ఫోన్లలైవ్ ప్రీ-బుకింగ్ కార్యక్రమాన్ని ఆగష్టు 23, సాయంత్రం 6 గంటలకు నిర్వహించనుంది. ఈ సమయంలో ప్రీబుక్ చేసుకున్న వినియోగదారులకు గెలాక్సీ Z ఫోల్డ్ 3, గెలాక్సీ Z ఫ్లిప్ 3లపై ఇప్పటికే ఉన్న ప్రీ-బుక్ ఆఫర్లతో పాటు ముందస్తు డెలివరీ, స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లు లభిస్తాయని తెలిపింది.
"భారతదేశంలోని యువ కొనుగోలుదారులు రియల్ టైమ్, ఇంటరాక్టివ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలని కోరుకుంటున్నారు. వారి సూచనల మేరకు, మేము 'శామ్సంగ్ నౌ'ని పరిచయం చేస్తున్నాము. ఇది శామ్సంగ్.కామ్ని వినియోగదారులకు అత్యంత విలువైన గమ్యస్థానంగా మారుస్తుంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ ఫ్లిప్ 3స్మార్ట్ఫోన్లతో భారతదేశంలో మొదటి లైవ్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అసిమ్ వార్సీ పేర్కొన్నారు.
శామ్సంగ్.కామ్ లో ఆగస్టు 23, సాయంత్రం 6 గంటలకు ప్రారంభంకానున్న ఈ లైవ్ ప్రీబుక్ ఈవెంట్లో వినియోగదారులు అర్ధరాత్రి వరకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లను పొందవచ్చు. ఈ ఆన్లైన్ ఈవెంట్ www.samsung.com/in/samsung-now/ లో అందుబాటులో ఉండనుంది. ఈ ఈవెంట్లో ప్రీబుకింగ్ చేసుకున్న కస్టమర్లకుఎర్లీ డెలివరీతో పాటు ఉచితంగా గెలాక్సీ స్మార్ట్‌ట్యాగ్,గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ ఫ్లిప్ కవర్ & ఎస్ పెన్,గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ సిలికాన్ కవర్ రింగ్ అదనంగా పొందేందుకు అర్హత లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు అప్‌గ్రేడ్ వోచర్ లేదా రూ.7,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ గెలుచుకోవచ్చు. అలాగే, కస్టమర్లు గెలాక్సీ Z ఫోల్డ్ 3 5జీ ప్రీ-బుకింగ్ చేసుకుంటే.. ఒక సంవత్సరానికి రూ.7,999 విలువైన శామ్సంగ్ కేర్+యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తుంది. అదే గెలాక్సీ Z ఫ్లిప్ 3 5G ని ప్రీ-బుకింగ్ చేసుకుంటే.. రూ.4799 విలువైన శామ్సంగ్ కేర్+ యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ 1 ఏడాది వరకు పొందొచ్చు.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.