SAMSUNG S TV DAYS SALE IS OFFERING FREE GALAXY TAB A7 TABLET WITH PREMIUM TVS GH VB
Samsung TV Days Sale: టీవీ డేస్ సేల్‌లో బంపరాఫర్లు.. రూ.22 వేలు విలువ చేసే గెలాక్సీ ట్యాబ్ ఉచితం.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ బిగ్ టీవీ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రీమియం టీవీల కొనుగోలుపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. 55 అంగుళాలు, అంతకంటే ఎక్కువ పరిమాణంలో గల UHD టీవీలు, QLED టీవీలు, నియో QLED టీవీల కొనుగోలుపై డిస్కౌంట్లను ప్రకటించింది.
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ (Samsung) బిగ్ టీవీ డేస్ సేల్‌ను (Bid TV days sale) ప్రారంభించింది. ఈ సేల్‌లో ప్రీమియం టీవీల కొనుగోలుపై ఆకర్షణీయమైన డీల్స్ (Best deals) అందిస్తోంది. 55 అంగుళాలు, అంతకంటే ఎక్కువ పరిమాణంలో గల UHD టీవీలు, QLED టీవీలు, నియో QLED టీవీల కొనుగోలుపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఇప్పటికే శామ్సంగ్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభమైన ఈ సేల్ జనవరి 31 వరకు కొనసాగుతుంది. సేల్‌లో భాగంగా కొన్ని ప్రీమియం టీవీల కొనుగోలుపై గెలాక్సీ ట్యాబ్ ఏ7 లేదా సౌండ్ బార్‌ను ఉచితంగా అందజేస్తుంది. 65 -అంగుళాల శామ్సంగ్ నియో QLED 8K టీవీ, 65 -అంగుళాల, 55 -అంగుళాల నియో QLED 4K టీవీలు, 65 -అంగుళాల, 55 -అంగుళాల QLED టీవీలు, 75 -అంగుళాల UHD టీవీల కొనుగోలుపై ఈ ఉచిత టాబ్లెట్ ఆఫర్ వర్తిస్తుంది.
వీటి కొనుగోలుపై ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ. 21,999 విలువైన గెలాక్సీ ట్యాబ్ A7 (LTE)ని పొందవచ్చు. ఈ ట్యాబ్లెట్ గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదలైంది. ఆఫర్ కింద లభిస్తున్న గెలాక్సీ ట్యాబ్ A7లో 10.4 -అంగుళాల WUXGA+ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 8- మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 7,040mAh బ్యాటరీ, 32 జీబీ స్టోరేజ్‌లను అందించింది. మైక్రో ఎస్డీ కార్డ్‌తో స్టోరేజ్‌ను మరింతగా విస్తరించుకోవచ్చు. సేల్ సమయంలో ఈ టాబ్లెట్‌తో పాటు 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. కేవలం రూ. 1,990 నుండి ప్రారంభమయ్యే సులభమైన ఈఎంఐ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
నియో QLED స్మార్ట్‌టీవీ కొనుగోలుపై సౌండ్ బార్ ఫ్రీ..
కాగా, ఉచిత సౌండ్‌బార్ ఆఫర్ మాత్రం కేవలం 75- అంగుళాల లేదా 85 -అంగుళాల నియో QLED టీవీ కొనుగోలుపై మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రీమియం టీవీ కొనుగోలుపై సుమారు రూ. 94,990 విలువైన HW-Q900A సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ సౌండ్‌బార్ డాల్బీ అట్మోస్, DTS:X, క్యూ సింఫనీ, ఎయిర్‌ప్లే 2, వైఫై, స్పాటిఫై వంటి కనెక్టింగ్ ఫీచర్లతో వస్తుంది.
ఒకవేళ, వీరు శామ్సంగ్ షాప్ యాప్‌ని ఉపయోగించి కొనుగోలు చేసినట్లయితే, రూ. 3 వేల వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కాగా, శామ్సంగ్ QLED టీవీలపై 10 -సంవత్సరాల బర్న్-ఇన్ వారంటీ వర్తిస్తుంది. అయితే, బిగ్ టీవీ డేస్ సేల్ సమయంలో దీన్ని కొనుగోలు చేస్తే అదనంగా మరో సంవత్సరం వారంటీ లభిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.