Refrigerators | దిగ్గజ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ శాంసంగ్ (Samsung) అదిరే శుభవార్త అందించింది. కీలక ప్రకటన చేసింది. 20 ఏళ్ల వరకు వారంటీ అందిస్తామని ప్రకటించింది. డిజిటల్ ఇన్వెర్టర్ మోటార్, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ వంటి వాటిపై ఈ వారంటీ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. డిజిటల్ ఇన్వర్టర్ మోటార్‌ను వాషింగ్ మెషీన్లో (Washing Machine) ఉపయోగిస్తారు. ఇంకా డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌ను రిఫ్రిజిరేటర్లో వినియోగిస్తారు. అంటే శాంసంగ్ వాషింగ్ మెషీన్, ఫ్రిజ్‌లపై 20 ఏళ్ల వరకు వారంటీ ఉంటుందని చెప్పుకోవచ్చు.
శాంసంగ్ ప్రొడక్టులపై ప్రజల్లో విశ్వసాన్ని పెంచడం, బ్రాండ్ విశ్వసనీయత పెరుగుదల వంటి వాటికి కంపెనీ ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నిర్ణయం వల్ల ఇవేస్టేజ్ కూడా తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది. ఎక్కువ కాలం మన్నికకు రావడంతో కొనుగోలుదారుల్లో కూడా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంది.
బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. నేటి ధరలు ఇలా!
కస్టమర్లకు స్థిరమైన సర్వీసులు అందించమే లక్ష్యంగా 20 ఏళ్ల వారంటీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని శాంసంగ్ తెలిపింది. డిజిటల్ ఇన్వర్టర్ మోటార్, డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్లకు ఈ వారంటీ వర్తిస్తుందని పేర్కొంది. హోమ్ అప్లయెన్సెస్‌ను తరుచుగా మార్చడం వల్ల కొనుగోలుదారులపై భారం పడుతుందని, అలాగే ఫిజికల్ వేస్టేజ్ కూడా పెరుగుతుందని వివరించింది. అంటే కస్టమర్లకు ప్రయోజనం కలిగించడంతో పాటు పర్యావరణ అనుకూల నిర్ణయం తీసుకున్నట్లు శాంసంగ్ తెలిపింది.
ఈ ప్రభుత్వ స్కీమ్‌లో చేరితే రూ. 41 లక్షలు మీవే.. ఎలానో తెలుసుకోండి!
డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ వల్ల వాషింగ్ మెషీన్లు స్మూత్‌గా, వేగంగా పని చేస్తాయి. దీని వల్ల కొనగోలుదారుల బడ్జెట్ కూడా అదుపులో ఉంటుంది. మరోవైపు డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనేది వివిధ స్పీడ్స్‌లో పని చేస్తుంది. ఇది ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. దీని వల్ల రిఫ్రిజిరేటర్లో టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. దీని వల్ల కాస్ట్ సేవింగ్ అవుతుంది. కార్బన్ ఉద్ఘారాలు కూడా తక్కువ వెలువడుతాయి. తక్కువ సౌండ్ వస్తుంది. దీర్ఘకాలం పని చేస్తుంది.
అందువల్ల ఇకపై ఎవరైనా వాషింగ్ మెషీన్ లేదంటే ఫ్రిజ్ కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంటే.. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. 20 ఏళ్ల వారంటీ అందిస్తున్న శాంసంగ్ ప్రొడక్టులను కొనుగోలు చేయొచ్చు. దీని వల్ల ఎక్కువ కాలం ప్రొడక్టులను ఉపయోగించుకోవడం వీలవుతుంది. తరుచుగా కొత్త కొత్త ప్రొడక్టులను కొనుగోలు చేయాల్సిన పని ఉండదు. శాంసంగ్ తాజా నిర్ణయంతో ఇతర కంపెనీలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో నెలకొన్ని పోటీ నేపథ్యంలో ఇతర కంపెనీలు కూడా శాంసంగ్ దారిలోనే పయనించే ఛాన్స్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samsung, Samsung Galaxy, Samsung sales