హోమ్ /వార్తలు /బిజినెస్ /

Samsung Axis Credit Card: యాక్సిస్ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... సాంసంగ్ ప్రొడక్ట్స్‌పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్

Samsung Axis Credit Card: యాక్సిస్ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... సాంసంగ్ ప్రొడక్ట్స్‌పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్

Samsung Axis Credit Card: యాక్సిస్ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... సాంసంగ్ ప్రొడక్ట్స్‌పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్
(image: Samsung India)

Samsung Axis Credit Card: యాక్సిస్ నుంచి కొత్త క్రెడిట్ కార్డ్... సాంసంగ్ ప్రొడక్ట్స్‌పై రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ (image: Samsung India)

Samsung Axis Credit Card | సాంసంగ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ కలిసి ప్రత్యేకంగా ఓ క్రెడిట్ కార్డును (Credit Card) రూపొందించాయి. ఈ క్రెడిట్ కార్డుతో సాంసంగ్ ప్రొడక్ట్స్ కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇటీవల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు (Credit Cards) ఎక్కువగా వస్తున్నాయి. రైల్వే ప్రయాణికుల కోసం ఐఆర్‌సీటీసీతో (IRCTC) కలిసి కో-బ్రాండెడ్ కార్డుల్ని తీసుకొస్తున్నాయి బ్యాంకులు. ఇక ఫ్లైట్‌లో వెళ్లేవారి కోసం ఫ్లైట్ టికెట్లపై డిస్కౌంట్స్ ఇస్తూ కో-బ్రాండెడ్ కార్డుల్ని రూపొందిస్తున్నాయి. ఇలా కొందరు కస్టమర్లను టార్గెట్ చేస్తూ బ్యాంకులు క్రెడిట్ కార్డుల్ని రూపొందిస్తున్నాయి. ఇప్పుడు సాంసంగ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులు కలిసి వీసా క్రెడిట్ కార్డును లాంఛ్ చేశాయి. సాంసంగ్ ఉత్పత్తుల నుంచి సర్వీసుల వరకు అన్నింటిపైనా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈఎంఐ, నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఇది వర్తిస్తుంది.

సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఇవే

సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫైనైట్ వేరియంట్లలో ఈ కార్డు తీసుకోవచ్చు. సిగ్నేచర్ కార్డుపై ఏటా రూ.10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ.2,500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక ఇన్ఫైనైట్ కార్డుపై ఏటా రూ.20,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మినిమమ్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ ఏమీ ఉండదు. అంటే ఏ చిన్న సాంసంగ్ ప్రొడక్ట్ కొన్నా క్యాష్‌బ్యాక్ వస్తుంది. దీంతోపాటు యాక్సిస్ నుంచి ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.

LIC Policy: జస్ట్ నెలకు రూ.2,000 పొదుపు చేస్తే చాలు... రూ.48 లక్షల రిటర్న్స్

సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మింత్రా, టాటా 1ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటో లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో లావాదేవీలు జరిపినా రివార్డ్స్ లభిస్తాయి. సిగ్నేచర్ వేరియంట్ కార్డ్ తీసుకోవాలంటే రూ.500 + పన్నులతో వార్షిక ఫీజు ఉంటుంది. ఇన్ఫైనైట్ కార్డుకు యాన్యువల్ ఫీజు రూ.5,000 + ట్యాక్సెస్ కలిపి ఉంటాయి. మొదటి మూడు లావాదేవీలు పూర్తి చేస్తే సిగ్నేచర్ కార్డుపై రూ.500 విలువైన 2500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇన్ఫైనైట్ కార్డుపై రూ.6,000 విలువైన 30000 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇది ఒకసారి లభించే వెల్‌కమ్ బెనిఫిట్ మాత్రమే.

Money Matters: అలర్ట్... ఈ శుక్రవారం షాక్ తప్పదు... గుర్తుంచుకోండి

సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కావాలనుకునేవారు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో, యాప్‌లో, వెబ్‌సైట్‌లో అఫ్లై చేయొచ్చు. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్, సాంసంగ్ షాప్, సాంసంగ్ పే ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అప్లై చేయొచ్చు. ఎక్కువగా సాంసంగ్ ప్రొడక్ట్స్ కొనేవారికి ఈ క్రెడిట్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఆఫర్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ప్రొడక్ట్‌పై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Axis bank, Credit cards, Personal Finance, Samsung

ఉత్తమ కథలు