Samsung Smartphones: శామ్‌సంగ్ నుంచి అద్బుత ఫీచర్లతో కొత్త ఫోన్లు.. వివరాలు తెలుసుకోండి..

శామ్‌సంగ్ ఫోన్

శామ్‌సంగ్ మొబైల్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అందులోనూ ఈ బ్రాండ్ నుంచి వచ్చిన గెలాక్సీ సిరీస్ మంచి విజయవంతమైంది. ఆగస్టు11న శామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ మోడళ్లు భారత మార్కెట్లో కనువిందు చేయనున్నాయి. అవే శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3. ఈ రెండు మడతపెట్టగలిగే ఫోల్డబుల్ డివైజ్‌లు కావడం విశేషం.

  • Share this:
శామ్‌సంగ్ మొబైల్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంది. అందులోనూ ఈ బ్రాండ్ నుంచి వచ్చిన గెలాక్సీ సిరీస్ మంచి విజయవంతమైంది. ఆగస్టు11న శామ్‌సంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ మోడళ్లు భారత మార్కెట్లో కనువిందు చేయనున్నాయి. అవే శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3. ఈ రెండు మడతపెట్టగలిగే ఫోల్డబుల్ డివైజ్‌లు కావడం విశేషం. తాజాగా లాంచ్‌కు ముందే ఆన్ లైన్ లో ఈ స్మార్ట్ ఫోన్ల ధరల వివరాలు బయటకు వచ్చాయి. 91 మొబైల్స్ ప్రకారం శామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 3 ధర రూ.1,35,000 కాగా.. ఎంఆర్పీతో కలిపి రూ.1,49,990 వరకు ఉండనుంది. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 మొబైల్ ధర రూ.80,000 నుంచి రూ,90,000 మధ్య ఉండనుంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 లాంచ్ అయితే మార్కెట్లో లభ్యమయ్యే అత్యంత సరసమైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా ఇది గుర్తింపుతెచ్చుకోనుంది.

భారత్‌లో గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.1,34,999 గా ఉంది. 256జీబీ స్టోరేజీతో వచ్చిన మోడల్ ఇది. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ గత ఏడాది జులైలో లాంచ్ అయింది. దీని ధర రూ.1,08,200గా ఉంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీని కలిగి ఉంది. ఈ వారం ప్రారంభంలో శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ధరలు యూరోపియన్ మార్కెట్లో బహిర్గతమయ్యాయి. వీటి ధరలు వరుసగా 2009 యూరోలు(రూ.1,76,800), 1029 యూరోలు(రూ.90,500)గా ఉన్నట్లు తెలుస్తోంది.

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ డివైజ్‌ను 1399 యూరోల వద్ద లాంచ్ చేసింది. తాజాగా లీక్ అయిన ధరల కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. గతంలో ఈ రెండు డివైజ్‌ల ఫీచర్ల గురించి వివరాలు బయటకు వచ్చాయి. డ్యుయల్ టోన్ డిజైన్ తో పాటు డ్యుయల్ కెమెరా, సెకండరీ డిస్ ప్లే వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయని తెలుస్తోంది. సెకండరీ డిస్‌ప్లేను కెమెరా మాడ్యూల్ పక్కన ఉంచారు. శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3.. ఇంతకు ముందు మోడళ్ల కంటే సన్నగా ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ చిప్ సెట్‌తో పనిచేస్తుంది.
Published by:Veera Babu
First published: