SAMSUNG GALAXY M32 5G AVAILABLE IN INDIA ON AUGUST 25 EVK
మార్కెట్లోకి మరో 5జీ మొబైల్: ఆగస్టు 25 నుంచి అందుబాటులో శామ్సంగ్ ఎమ్32 5జీ
(ప్రతీకాత్మక చిత్రం)
భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ M32 5జీ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఇండియాలో 5జీ మార్కెట్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎన్నో విభిన్న రకాల ఫీచర్లతో కొత్త మొడల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
భారతదేశంలో శామ్సంగ్ గెలాక్సీ M32 5జీ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్‌లో శామ్సంగ్ ప్రత్యేక మైక్రోసైట్‌ను ఏర్పాటు చేసింది వినియోగదారులు అమెజాన్ ద్వారా ఈ మోడల్‌ను పొందవచ్చు. ఎమ్32 5జీ మోడల్లో అధునాతమైన కెమరా నూతన డిజైన్‌తో మన ముందుకు రాబోతుంది. ప్యానల్ సెల్ఫీ కెమెరా కసం వాటర్ డ్రాప్-స్టైల్ నాచ్ని కలిగి ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సి ఎమ్32 4జీ ఈ ఏడాది జూలైలోనే మార్కెట్లోకి వచ్చింది.
ఫోన్ ఫీచర్లు..
కొత్తగా మార్కెట్లోకి వస్తున్న శామ్సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ 5000mAh సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఎమ్32 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 720 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5జీ టెక్నాలజీతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఒపో ఏ53, వివో వై52ఎస్ అందుబాటులో ఉన్నాయి. శామ్సంగ్ నుంచే వెలువడిన గెలాక్సి ఎమ్42 5జీ తర్వాత రెండో 5జీ ఫోన్‌గా గెలాక్సీ ఎమ్32 5జీగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఈ మొబైల్ ధర్ రూ.25,000 ఉన్నప్పటికీ ఇంకా ధరపై స్పష్టత రాలేదు. భారత దేశంలో 5జీ కనెక్టివిటీ వాణిజ్య పరంగా ఇంకా అందుబాటులోకి రానప్పటికీ శామ్సంగ్ ఈ రంగంలో మొబైల్ అమ్మకాల్లో గట్టి పోటీని ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లు తమ ఫోన్ ఫీచర్లలో ఈ టెక్నాలజీని ప్రదర్శిస్తున్నాయి.
శామ్సంగ్ గెలాక్సీ ఎమ్32 5జీ 6.4 అంగుళాల ఫుల్-హెడీ+ అమోలెడ్ డిస్ప్లేతో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. సెల్ఫీ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ధర నిర్ణయం కానప్పటికీ గెలాక్సీ ఎమ్42 5జీ ధర రూ.20,999తో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఇండియాలో 5జీ మార్కెట్‌పై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎన్నో విభిన్న రకాల ఫీచర్లతో కొత్త మొడల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.