భారత్ లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు అందిస్తోన్న సంస్థ సాంసంగ్. త్వరలో ఈ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రానుంది. అదే సాంసంగ్ గెలాక్సీ ఎం12. మార్చి11న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ను లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందీ సంస్థ.
భారత్ లో అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు అందిస్తోన్న సంస్థ సాంసంగ్. త్వరలో ఈ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రానుంది. అదే సాంసంగ్ గెలాక్సీ ఎం12. మార్చి11న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ ను లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందీ సంస్థ. ఫిబ్రవరిలోనే వియత్నాంలో దీన్ని ప్రవేశపెట్టింది. దీంతో స్పెసిఫికేషన్ల వివరాలు బయటకు వచ్చాయి. 6000mAh బ్యాటరీ, క్వాడ్ రేర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కోసం ఓ ప్రత్యేక నాచ్ ను కూడా ఇందులో పొందుపరిచారు. అదనంగా 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే ఫీచర్ ఇందులో ఉంది. భారత్ లో సాంసంగ్ గెలాక్సీ ఎం12 ధరపై స్పష్టత లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెండు ధరలు ఉండేట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రూ.12,000లోపు లేదా 12 వేలకు అటు ఇటుగా ధర ఉండనున్నట్లు తెలుస్తోంది. మార్చి 11న దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. గత నెలలో వియత్నాంలో లాంచ్ అయిన గెలాక్సీ ఎం12 మొబైల్ బ్లాక్, ఎలిగెంట్ బ్లూ, ట్రెండీ గ్రీన్ కలర్స్ లో ఇది లభ్యమవుతుంది.
సాంసంగ్ గెలాక్సీ ఎం12 స్పెసిఫికేషన్లు..
90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా నాచ్ కూడా ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో పాటు క్వాడ్ రేర్ కెమేరా సెటప్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 48 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంది. అంతే కాకుండా 8ఎన్ఎం ఎక్సీనాస్ ఎస్ఓసీ పవర్ ను పొందుపరిచారు. యూఎస్ బీ సీ-పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను ఇది కలిగి ఉంది. వియత్నాంలో లాంచ్ అయిన ఈ ఫోన్ 32జీబీ, 64జీబీ, 128జీబీ స్టోరేజి కలిగిన వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది.
అంతేకాకుండా 1టీబీ మెమొరీ కార్డు వచ్చే వరకు విస్తరించే అవకాశముంది. భారతీయ మోడల్ కోసం కాన్ఫిగరేషన్ లో కొన్ని మార్పులు ఉండవచ్చు. శ్యామ్ సంగ్ గెలాక్సీ ఎం12లో కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీఎల్టీఈ, వైఫై802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ వీ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్ పైన పేర్కొన్న యూఎస్బీ టైప్-సీ పోర్టుతో పాటు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. చివరిగా ఈ ఫోన్ 164.0X75.9X9.7ఎంఎం రిజల్యూషన్ ను కలిగి ఉంది. 221 గ్రాముల బరువును కలిగి ఉంది.