హోమ్ /వార్తలు /బిజినెస్ /

Samsung Galaxy F62: రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్ లలో శాంసంగ్ గేలాక్సీ F62 అమ్మకాలు.. భారీగా డిస్కౌంట్.. వివరాలివే

Samsung Galaxy F62: రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్ లలో శాంసంగ్ గేలాక్సీ F62 అమ్మకాలు.. భారీగా డిస్కౌంట్.. వివరాలివే

ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ ద్వారా కస్టమర్లు లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఆ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉండే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లలో కొత్త శాంసంగ్ గేలక్సీ F62 అందుబాటులో ఉండనుంది.

ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ ద్వారా కస్టమర్లు లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఆ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉండే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లలో కొత్త శాంసంగ్ గేలక్సీ F62 అందుబాటులో ఉండనుంది.

ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ ద్వారా కస్టమర్లు లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఆ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉండే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లలో కొత్త శాంసంగ్ గేలక్సీ F62 అందుబాటులో ఉండనుంది.

ఇంకా చదవండి ...

  కొత్త శాంసంగ్ గేలాక్సీ F62 లాంచ్ కోసం రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ ఆఫ్ లైన్ అమ్మకాలకు భాగస్వాములుగా నిర్ణయించబడ్డాయి. దీంతో ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్సు ద్వారా కస్టమర్లు లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. 22వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉండే రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లలో కొత్త శాంసంగ్ గేలక్సీ F62 అందుబాటులో ఉండనుంది. కొత్త శాంసంగ్ గేలక్సీ F62 ఫోన్ శాంసంగ్ 7nm ఎక్సినోస్ 9825 2.73 GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ మొబైల్ 128 GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్ మరియు కలర్ సూపర్ AMOLED  స్క్రీన్ తో కలిగి ఉంది. ఈ మొబైల్ 7000 mAh బ్యాటరీతో కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ ను గేమర్స్ కు డ్రీమ్ ఫోన్ గా మార్చనున్నాయి. ఈ ఫోన్ ఇన్ట్యూటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు మరియు ఫేస్ అన్లాక్ ఆప్షన్లతో సూపర్ సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

  అల్ట్రా వైడ్ మరియు మేక్రో షూటింగ్ అందించే 64 MP కెమెరా తో, ఇంకా  6 GB RAM ను కలిగి ఉండే వేరియంట్ ధర రూ. 21,499 కాగా.. 8 GB RAM కలిగి ఉండే వేరియంట్ ధర రూ. 23,499గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద రూ. 2,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్, సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క EMI మీద రూ. 2,500/- వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

  రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్ లలో Samsung Galaxy F62 అమ్మకాలు

  రిలియన్స్ డిజిటల్ లో ఈ ఫోన్ అమ్మకాల గురించి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ బ్రియాన్ బేడ్ మాట్లాడుతూ.. కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 ని ఇండియా అంతటా కస్టమర్లకు అందించడంలో తాము మాత్రమే ఆఫ్ లైన్ భాగస్వామి కావడం ఆనందం కలిగిస్తోందన్నాన్నారు. ఈ ఫోన్ పెర్ఫార్మన్స్, ధరతో కస్టమర్లు చాలా థ్రిల్ అవుతారని నమ్ముతున్నామన్నారు. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ లో కొత్త సాంసంగ్ గెలాక్సీ F62 కొనుగోలు చేయాలని ఎంచుకునే జియో కస్టమర్లు, లాంచ్ సమయంలో రూ. 10,000/- విలువైన ప్రయోజనాలతో ఇతర ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు కూడా పొంతుతారని వివరించారు. ఈ ప్రయోజనాలలో రూ. 349/- ప్లాన్ లో మీరు ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకొని రూ. 3,000/- ఇన్ స్టాంట్ క్యాష్ బ్యాక్ మరియు పార్టనర్ బ్రాండ్స్ నుండి రూ. 7,000/- విలువైన వోచర్లు పొందవచ్చన్నారు. ఈ ఆఫర్ కొత్త మరియు ప్రస్తుతం ఉన్న అందరు జియో సబ్-స్క్రైబర్స్ కు వర్తిస్తుందన్నారు. సంస్థ నియమాలు, షరతులకు అనుగుణంగా ఈ ఆఫర్లు వర్తింస్తాయి

  రిలయన్స్ డిజిటల్ గురించి..

  రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్. ఇది 800 సిటీలలో 400+ లార్జ్ ఫార్మట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మరియు 1800+ మై జియో స్టోర్లతో, దేశెంలో నలుమూలలో ఉన్న కస్టమర్లకు సేవలు అందజేస్తూ, అత్యాధునిక టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉండేలా చేస్తోంది. 200కు పైగా అంతర్జాతీయ మరియు దేశీయ ఉత్పాదనలు మరియు ఆకర్షణీయమైన ధరలలో 5000 కు పైగా ఉత్పాదనలు కలిగిఉన్న రిలయన్స్ డిజిటల్, కస్టమర్లకు తమ అభిరుచికి తగినట్లు సరియైన టెక్నాలజీ సొల్యుషన్స్ పొందుటకు అతి పెద్ద సంఖ్యలో మోడల్స్ ఎంచుకునే సౌకర్యం అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్ లో, ప్రతి స్టోరులో ట్రెయినింగ్ పొంది, చక్కని సమాచారం కలిగిన స్టాఫ్, స్టోర్ లోని ప్రతి ఉత్పాదన గురించి కస్టమర్లకు సంతోషంగా పూర్తి సమాచారం అందజేస్తారు.

  ముఖ్యంగా, రిలయన్స్ డిజిటల్ అన్ని ఉత్పాదనలకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందిస్తోంది. రిలయన్స్ ResQ, రీటైలర్ సర్వీస్ విభాగం మరియు ఇండియాలో ఏకైక ISO 9001 సర్టిఫికేట్ పొందిన ఒక ఎలక్ట్రానిక్ సర్వీస్ బ్రాండ్, వారమంతా సపోర్ట్ అందించుటకు మరియు పరిపూర్ణమైన పరిష్కారాలు అందజేయటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది. వినియోగదారులు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి ఏ రిలయన్స్ డిజిటల్ స్టోరును సందర్శించవచ్చు. లేదా www.reliancedigital.in వెబ్ సైట్ ను కూడా సందర్శించవచ్చు. తద్వారా ఇన్ స్టాంట్ డెలివరీ  (3 గంటలకు కంటె తక్కువ సమయంలో డెలివరీ) అందజేస్తుంది. లేదా వారు తమకు దగ్గరలోని స్టోరులో కూడా వాటిని పొందవచ్చు. మరింత సమాచారం కొరకు  www.reliancedigital.in ను సందర్శించండి.

  First published:

  Tags: Reliance, Reliance Digital, Reliance JioMart, Samsung

  ఉత్తమ కథలు