SAMSUNG GALAXY A22S WITH MEDIATEK DIMENSITY 700 LAUNCHED MK GH
Samsung Galaxy A22s: శామ్సంగ్ గెలాక్సీ A22s 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 48 ఎంపీ కెమెరా, భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లు
Samsung Galaxy A22s 5G
Samsung Galaxy A22s: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ దిగ్గజం శామ్సంగ్ మరో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ A22s పేరుతో ఇది రష్యా మార్కెట్లోకి విడుదలైంది.
Samsung Galaxy A22s: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ దిగ్గజం శామ్సంగ్ మరో మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. శామ్సంగ్ గెలాక్సీ A22s పేరుతో ఇది రష్యా మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఏడాది జూలైలో భారత మార్కెట్లోకి విడుదలైన శామ్సంగ్ గెలాక్సీ A22 5G కి రీ బ్యాడ్జ్ మోడల్‌గా వచ్చింది. మిడ్‌రేంజ్ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించింది. ప్రస్తుతం రష్యా మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లాంచింగ్‌పై ఎటువంటి స్పష్టత లేదు.
శామ్సంగ్ గెలాక్సీ A22s 5G ధర
కొత్త శామ్సంగ్ గెలాక్సీ A22s 5G ధర, లభ్యత వివరాలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ మింట్, గ్రే, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ గల రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ A22s 5G స్పెసిఫికేషన్స్
శామ్సంగ్ గెలాక్సీ A22s 5G స్మార్ట్‌ఫోన్ 6.6- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ TFT LCD డిస్ప్లేతో వస్తుంది. వన్ యూఐ కస్టమ్ స్కిన్‌తో కూడిన ఆండ్రాయిడ్ 11 ఆదారిత ఓఎస్‌పై నడుస్తుంది. మీడియో టెక్ డైమెన్సిటీ 700 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చేర్చింది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్ కెమెరా, 5MP సెకండరీ సెన్సార్ కెమెరా, 2MP సెన్సార్ కెమెరాలను అందించింది. దీని ముందు భాగంలో, 8MP సెల్ఫీ కెమెరాను చేర్చింది. వెనుక భాగంలోని కెమెరాలు హెచ్డీ రిజల్యూషన్ గల 10x డిజిటల్ జూమ్,120fps స్లో-మోషన్ వీడియోలకు మద్దతు ఇస్తాయి.
కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్ఎఫ్సీ వంటివి చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించవచ్చు. దీనిలో 5,000mAh బ్యాటరీని అందించింది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇక, భద్రత కోసం దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చేర్చింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.