హోమ్ /వార్తలు /బిజినెస్ /

Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ

Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ
(image: Samsung)

Samsung Single EMI Scheme: సాంసంగ్ నుంచి అద్భుతమైన ఆఫర్... ఎన్ని వస్తువులు కొన్నా ఒకే ఈఎంఐ (image: Samsung)

My Samsung My Combo Scheme | మీరు వేర్వేరు ప్రొడక్ట్స్ కొని వేర్వేరుగా ఈఎంఐలు చెల్లిస్తున్నారా? ఎన్ని ప్రొడక్ట్స్ కొన్నా ఒకే ఈఎంఐ చెల్లించే ఆఫర్‌ను ప్రకటించింది సాంసంగ్.

దసరా, దీపావళి సందర్భంగా ఇంటికి కొత్త వస్తువులు తీసుకురావడం ఆనవాయితీ. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు... ఇలా కొత్త వస్తువులు ఏవైనా కొనాలనుకుంటే దసరా, దీపావళి వరకు ఆగుతుంటారు. మంచి ముహూర్తం ఒక సెంటిమెంట్ అయితే, ఫెస్టీవ్ సీజన్‌లో డిస్కౌంట్స్ బాగా రావడం మరో కారణం. డబ్బులు లేకపోయినా ఈఎంఐల ద్వారా ఈ ప్రొడక్ట్స్ కొంటూ ఉంటారు. అయితే టీవీ కొంటే ఒక ఈఎంఐ, ఫ్రిజ్ కొంటే ఇంకో ఈఎంఐ, స్మార్ట్‌ఫోన్ కొంటే మరో ఈఎంఐ ఇలా వేర్వేరుగా ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి సమస్య ఎదుర్కొనేవారికి అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది సాంసంగ్ ఇండియా. 'మై సాంసంగ్ మై కాంబో' పేరుతో సింగిల్ ఈఎంఐ స్కీమ్‌ను ప్రకటించింది. అంటే మీరు ఎన్ని వస్తువులు కొన్నా ఈఎంఐ మాత్రం ఒకటే ఉంటుంది. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఈ స్కీమ్ ప్రకటించింది సాంసంగ్. సింపుల్ ఫైనాన్స్ స్కీమ్ ఉండాలన్న ఆలోచనతో ఈ ఆఫర్ అందిస్తోంది.

Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే

Oppo A33: భారీ డిస్కౌంట్‌తో ఒప్పో ఏ33 స్మార్ట్‌ఫోన్ సేల్

భారతదేశంలో 1000 పైగా పట్టణాల్లోని సాంసంగ్ ఇండియా రీటైల్ స్టోర్లలో ఈ పండుగ సీజన్‌లో 'మై సాంసంగ్ మై కాంబో' స్కీమ్ ద్వారా వస్తువులు కొనొచ్చు. సాంసంగ్ ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు రెండు సాంసంగ్ ప్రొడక్ట్స్ కొంటే రూ.1,790, మూడు ప్రొడక్ట్స్ కొంటే రూ.2,490, నాలుగు ప్రొడక్ట్స్ కొంటే రూ.3,390 ఈఎంఐ చెల్లించాలి. ప్రొడక్ట్స్ వేర్వేరుగా కొన్నా ఈఎంఐ మాత్రం ఒకటే ఉంటుంది. అంటే మీరు సాంసంగ్ టీవీ, స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్ లాంటి ప్రొడక్ట్స్ కొంటే వీటికి ఒకే ఈఎంఐ చెల్లిస్తే చాలు. ఈ స్కీమ్‌తో పాటు సాంసంగ్ ప్రొడక్ట్స్‌పై కస్టమర్లకు ఏవైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చేందుకు ఇప్పటికే 11,000 మంది సేల్స్ స్టాఫ్‌కు శిక్షణ ఇచ్చింది సాంసంగ్. చిన్న పట్టణాల్లో 1,200 హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. 'మై సాంసంగ్ మై కాంబో' స్కీమ్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని, ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లకు సంతోషం పంచుతుందని సాంసంగ్ ఇండియా కన్స్యూమర్స్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజు పుల్లన్ తెలిపారు.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ వడ్డీ ఎక్కడో తెలుసుకోండి

Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఈ పుకార్లు నమ్మొద్దు

ఇక సాంసంగ్ గ్రాండ్ దివాళీ సేల్ అక్టోబర్ 27 వరకు కొనసాగనుంది. సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు, అప్లయెన్సెస్, టీవీలు, యాక్సెసరీస్, ట్యాబ్లెట్స్ లాంటి ప్రొడక్ట్స్‌పై 60 శాతం తగ్గింపు ప్రకటించింది సాంసంగ్. ఇక హోమ్ ఫెస్టీవ్ హోమ్ సేల్ నవంబర్ 20 వరకు కొనసాగనుంది.

First published:

Tags: Diwali 2020, Samsung

ఉత్తమ కథలు