వరుసగా మూడోసారి ఫోర్బ్స్‌ రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్

52 ఏళ్ల సల్మాన్ ఖాన్ వరుసగా మూడోసారి టాప్‌లో నిలిచాడు. టైగర్ జిందాహై, రేస్ 3 సినిమాలతో పాటు టెలివిజన్ షోస్, ఇతర బ్రాండ్‌ల ద్వారా రూ.253.25 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు సల్మాన్ ఖాన్. ఈ ఏడాదిలో టాప్ 100 సెలబ్రిటీల మొత్తం సంపాదన రూ.3,140.25 కోట్లల్లో ఇది 8.06 శాతం.

news18-telugu
Updated: December 5, 2018, 9:44 AM IST
వరుసగా మూడోసారి ఫోర్బ్స్‌ రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్(ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ మళ్లీ టాప్‌లో నిలిచాడు. ఇప్పటివరకు ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసిన ఏడో జాబితా ఇది. 1 అక్టోబర్, 2017 నుంచి 30 సెప్టెంబర్ 2018 వరకు సెలబ్రిటీలు ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా పొందిన ఆదాయాన్ని బట్టి ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 జాబితా రూపొందించారు. ఇందులో 52 ఏళ్ల సల్మాన్ ఖాన్ వరుసగా మూడోసారి టాప్‌లో నిలిచాడు. టైగర్ జిందాహై, రేస్ 3 సినిమాలతో పాటు టెలివిజన్ షోస్, ఇతర బ్రాండ్‌ల ద్వారా రూ.253.25 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాడు సల్మాన్ ఖాన్. ఈ ఏడాదిలో టాప్ 100 సెలబ్రిటీల మొత్తం సంపాదన రూ.3,140.25 కోట్లల్లో ఇది 8.06 శాతం. ఇక భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ.228.09 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 116.53 శాతం సంపాదన పెరగడం విశేషం.

అక్షయ్ కుమార్ రూ.185 కోట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. షారుఖ్ ఖాన్‌ సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ఆయన 2018 టాప్-10 జాబితాలో చోటు దక్కించుకోలేదు. 2017లో షారుఖ్ ఖాన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాదితో పోలిస్తే షారుఖ్ ఖాన్‌ ఆదాయం 33 శాతం తగ్గింది. రూ.56 కోట్లతో 17వ స్థానంలో ఉన్నాడు. ఇక దీపికా పదుకొనె నాలుగో స్థానంలో ఉండటం విశేషం. టాప్-5లో చోటు దక్కించుకున్న మొదటి మహిళ కూడా. పద్మావత్‌తో పాటు ఇతర బ్రాండ్ల ద్వారా రూ.112.8 కోట్లు సంపాదించింది. 2018లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 ఈసారి ఆసక్తికరంగా ఉంది. దక్షిణాది నుంచి 17 మంది సెలబ్రిటీలు ఉన్నారు. గతేడాది దక్షిణాది నుంచి 13 మందే ఉన్నారు. గతేడాది 33 మంది బాలీవుడ్ యాక్టర్లు ఉంటే ఈసారి 31 మంది మాత్రమే ఉన్నారు.

సెలబ్రిటీ-100 జాబితా సెలబ్రిటీల ఆదాయాన్ని లెక్కించే ఖచ్చితమైన బారోమీటర్. కొత్తతరం సెలబ్రిటీలతో సెలబ్రిటీ-100 ప్రత్యేక ఇష్యూలో ఆదాయాల జాబితా మాత్రమే కాదు సచిన్ టెండుల్కర్, అక్షయ్ కుమార్, దీపికా పడుకొనే లాంటివారి కవర్ స్టోరీస్ కూడా ఉంటాయి.
బ్రియాన్ కార్వాల్హో, ఎడిటర్, ఫోర్బ్స్ ఇండియా


ఆదాయం శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇండియన్ క్రికెట్ టీమ్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా(రూ.28.46 కోట్లు) టాప్‌లో ఉండటం విశేషం. గతేడాది ఆదాయం రూ.3.04 కోట్లతో పోలిస్తే ఈసారి 9 రెట్లు పెరిగింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నుంచి ఏకైక మహిళగా నయనతార(రూ.15.17 కోట్లు) తొలిసారి జాబితాలో చోటు దక్కించుకుంది. గతేడాది సెలబ్రిటీ-100 మొత్తం ఆదాయం రూ.2,683.31 కోట్లు కాగా ఈ ఏడాది రూ.3,140.25 కోట్లకు పెరిగింది.

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ-100 జాబితాలో టాప్-10లో ఉన్నది వీళ్లే...
1. సల్మాన్ ఖాన్(నటుడు)- రూ.253.25 కోట్లు

2. విరాట్ కోహ్లీ(క్రీడాకారుడు)-రూ. 228.09 కోట్లు
3. అక్షయ్ కుమార్ (నటుడు)- రూ.185.00 కోట్లు
4. దీపికా పదుకొనె (నటి)- రూ.112.80 కోట్లు
5. మహేంద్ర సింగ్ ధోనీ (క్రీడాకారుడు)-రూ. 101.77 కోట్లు
6. అమీర్ ఖాన్ (నటుడు)- రూ.97.50 కోట్లు
7. అమితాబ్ బచ్చన్ (నటుడు)- రూ.96.17 కోట్లు
8. రణ్‌వీర్ సింగ్ (నటుడు)- రూ.84.67 కోట్లు
9. సచిన్ టెండుల్కర్(స్పోర్ట్స్ పర్సనాలిటీ)-రూ. 80.00 కోట్లు
10. అజయ్ దేవ్‌గన్ (నటుడు)- రూ.74.50 కోట్లు
Published by: Santhosh Kumar S
First published: December 5, 2018, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading