హోమ్ /వార్తలు /business /

Electric Vehicles: 2022 ఫిబ్రవరిలో పెరిగిన ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు.. మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న కొత్త సంస్థలు..!

Electric Vehicles: 2022 ఫిబ్రవరిలో పెరిగిన ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు.. మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న కొత్త సంస్థలు..!

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు కూడా ఈవీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చాలా సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోకి అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల  (Electric Vehicles) కంటే ఎలక్ట్రిక్ కార్ల విక్రయం చాలా తక్కువగా ఉంది. 2022 ఫిబ్రవరిలో మొత్తం 2,264 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే 2021వ సంవత్సరంలో ఫిబ్రవరిలో 434 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, జనవరిలో మొత్తం 1,360 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్‌ కారుల విక్రయాల్లో సంవత్సరానికి మూడు అంకెల పెరుగుదల కనిపించింది.

  గణాంకాలు ఇలా..

  2022 ఫిబ్రవరిలో టాటా మోటార్స్ (TATA Motors) 2,264 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది 2021 ఫిబ్రవరిలో కంటే 421 శాతం ఎక్కువ. మునుపటి సంవత్సరం కంటే 66 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ విభాగంలో టాటా Nexon EV, Tigor EV కారులను అందిస్తోంది. ఈ రెండూ రూ.10 నుంచి రూ.20 లక్షల మధ్య అందుబాటులో ఉన్న ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ వాహనాలు.

  ఈ జాబితాలో MG మోటార్ ZS EV(MG Motor ZS EV) సంస్థ కూడా ఉంది. మొత్తం 38 యూనిట్లను విక్రయించింది. అయినప్పటికీ దాని ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ అమ్మకాలు మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా తగ్గి 127 యూనిట్లకు చేరుకున్నాయి. 2021 జవనరిలో 59 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మంత్‌ ఆన్‌ మంత్‌ విక్రయాలు మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా క్షీణించినట్లు తెలిపింది.

  ఎలక్ట్రిక్ వాహనాల  (Electric Vehicles) మార్కెట్లో చాలా కాలంగా కొనసాగుతున్న మహీంద్రా విషయానికి వస్తే.. ఫిబ్రవరిలో 12, జనవరిలో 31 యూనిట్లు విక్రయించింది. BYD ఇండియా సంస్థ 2022 జనవరి, ఫిబ్రవరి (February)లో 10 యూనిట్ల చొప్పున విక్రయించింది. ఇది చైనాకి చెందిన ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ యొక్క అనుబంధ సంస్థ. BYD ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ భారత్‌లో e6 ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.

  ఈ ఏడాది ఫిబ్రవరిలో హ్యుందాయ్ ఇండియా ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను  (Electric Vehicles) విక్రయించింది. దేశంలో హ్యుందాయ్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్‌ వాహనం హ్యుందాయ్ కోనా బ్రాండ్. ఫిబ్రవరి అమ్మకాలలో హీరో ఎలక్ట్రిక్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నట్లు అందుబాటులో ఉన్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇది గత సంవత్సరంలో 2,194 విక్రయించే స్థాయి నుంచి 7,357 యూనిట్లను విక్రయించే స్థాయికి చేరుకొంది. 2022 జనవరిలో విక్రయించిన 7,764 యూనిట్లను నెలవారీగా పరిశీలిస్తే మాత్రం తగ్గుదల కనిపిస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో మరో అగ్రశ్రేణి ప్లేయర్ ఒకినావా.. 6,000 యూనిట్ల కంటే తక్కువ అమ్మకాలను నమోదు చేసింది. గతేడాది విక్రయాల కంటే ఇది వేయి యూనిట్లు మాత్రమే ఎక్కువ. గత నెలతో పోలిస్తే యూనిట్ల విక్రయాల్లో 5 శాతం వృద్ధి నమోదు చేసింది.

  ఆంపియర్ ఈవీ సంస్థ 4,000 యూనిట్లకు పైగా విక్రయించింది. అంతకు ముందు దాదాపు 800 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. జనవరి వివరాలను పరిశీలిస్తే 4,220 యూనిట్లు విక్రయించింది. కొత్తగా వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం 3 వేల యూనిట్లకు పైగా విక్రయించింది. ఇది జనవరిలో 1,102గా మాత్రమే ఉంది.

  ఏథర్ ఎనర్జీ 2,230 యూనిట్లను విక్రయించింది, ఇది అంతకుముందు సంవత్సరం కంటే 626 యూనిట్లు ఎక్కువ. జనవరిలో 1,883 యూనిట్లను ఏథర్‌ ఎనర్జీ అమ్మగలిగింది.

  బజాజ్ ఆటో చేతక్ సేల్స్ 1,314 యూనిట్లు, ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ సేల్స్‌లో 111 యూనిట్లు పెరిగాయి. 611 యూనిట్ల నుంచి మంత్‌ ఆన్‌ మంత్‌ సేల్స్‌ గణనీయంగా పెరిగాయి. హర్యానాకు చెందిన బీయింగ్ ఇండియా ఎనర్జీ విక్రయాలు 256 యూనిట్ల నుంచి 1,149 యూనిట్లకు పెరిగాయని పేర్కొంది. మంత్‌ ఆన్‌ మంత్‌ వృద్ధి 1,062 యూనిట్లతో 8 శాతం నమోదు చేసింది.

  * భవిష్యత్తు ఇలా..

  భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 2022లో వాహన విక్రయాలలో 1.3 శాతంగా ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో గణనీయమైన పెరుగుదలతో, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ మార్కెట్ వాటా 10 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణను ప్రోత్సహించే విధానాలు ఇటీవలి సంవత్సరాలలో కీలకమయ్యాయి.

  కన్సల్టింగ్ సంస్థ RBSA అడ్వైజర్స్ నివేదిక ప్రకారం.. భారతదేశ ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్ 90 శాతం వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల విక్రయాలు పెరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మార్కెట్‌ 2030 నాటికి $150 బిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది.

  First published:

  ఉత్తమ కథలు