హోమ్ /వార్తలు /బిజినెస్ /

Salary: ఉద్యోగులకు కమ్మటి వార్త.. భారీగా జీతాల పెంపు?

Salary: ఉద్యోగులకు కమ్మటి వార్త.. భారీగా జీతాల పెంపు?

ఉద్యోగులకు కమ్మటి వార్త.. భారీగా జీతాల పెంపు?

ఉద్యోగులకు కమ్మటి వార్త.. భారీగా జీతాల పెంపు?

Employees | ఉద్యోగులకు గుడ్ న్యూస్. వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. ఈసారి దేశంలో వేతన పెంపు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Salary Hike| దేశంలో ఉద్యోగులకు (Employees) భారీగా వేతనాలు పెరగబోతున్నాయి. 2023లో వేతనం (Salary) పెంపు 10.4 శాతంగా ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. 2022లో వేతన పెంపు 10.6 శాతంగా ఉంది. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ పీఎల్‌సీ నిర్వహించిన ఒక సర్వేతో ఈ విషయం వెల్లడి అయ్యింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో సర్వే నిర్వహించింది. దాదాపు 1300 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. అంటే ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయని చెప్పుకోవచ్చు.

  అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లోనే వేతన పెంపు ఎక్కువగా ఉంది. దేశంలో 10.6 శాతంగా వేతన పెంపు ఉంటే.. ఇతర దేశాల్లో ఇది చాలా తక్కువగా ఉంది. జర్మనీలో 3.5 శాతంగా, యూకేలో 4 శాతంగా, అమెరికాలో 4.5 శాతంగా, చైనాలో 6 శాతంగా, బ్రెజిల్‌లో 5.6 శాతంగా, జపాన్‌లో 3 శాతంగా ఉంది.

  వారికి అదిరే గుడ్ న్యూస్.. వీరికి భారీ షాక్! అక్టోబర్ 1 నుంచి..

  భారత్‌లో కోవిడ్ 19కు ముందు వేతన పెంపు ఒక అంకెగానే ఉంది. 2019లో 9.3 శాతంగా ఉంది. 2020లో 6.1 శాతానికి వేతన పెంపు పడిపోయింది. 2021లో ఇది 9.3 శాతానికి చేరింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం డబుల్ డిజిట్ పెరుగుదల ఉండబోతోంది.

  అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్, సిలిండర్ వరకు మారే 8 అంశాలివే

  టెక్నాలజీ సంబంధిత రంగాల్లో అధిక వేతన పెంపు ఉండొచ్చని సర్వేలో తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి వల్ల ఈ రంగాలో అస్థిరతలు కొనసాగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈకామర్స్ విభాగంలో వేతన పెంపు 12.8 శాతంగా ఉండొచ్చని సర్వే పేర్కొంటోంది. దీని తర్వాతి స్థానంలో స్టార్టప్స్ ఉన్నాయి. వీటిల్లో వేతన పెంపు 12.7 శాతంగా ఉండొచ్చు. తర్వాత ఐటీ రంగంలో 11.3 శాతం, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో 10.7 శాతంగా వేతన పెంపు ఉండే అవకాశం ఉంది.

  వేతన పెంపుతో పాటుగా ఉద్యోగుల వలసలు కూడా భారీగా ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. 2022 తొలి అర్ధ భాగంలో వలసలు 20.3 శాతంగా నమోదు అయ్యాయని సర్వే తెలియజేసింది. 2021లో వలసలు ఏకంగా 21 శాతంగా ఉన్నాయి. వచ్చే కొన్ని నెలల వరకు వలసలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని అంచనా వేసింది. అంటే రానున్న కాలంలో వలసలు ఎక్కువగానే ఉండనున్నాయి. కాగా మరోవైపు ప్రపంచంలో ఈ ఏడాది చివరకు ఆర్థిక మాంద్యం రావొచ్చనే భయాలు చాలానే ఉన్నాయి. అయినా కూడా 2023లో డబుల్ డిజిట్ వేతన పెంపు ఉండనుండటం చాలా సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక మాంద్యం వస్తే మాత్ర ఐటీ ఉద్యోగులపై అధిక ప్రభావం పడొచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Employees, Hike salary, Salary Hike

  ఉత్తమ కథలు