Breaking News: కరోనా పీడ విరగడయ్యే...వ్యాక్సిన్ సిద్ధం...రష్యా సైంటిస్టుల విజయం..

రష్యాకు చెందిన సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. దీంతో కరోనాతో సతమతమవుతున్న ప్రపంచానికి కాస్త ఊరట కల్పించింది.

news18-telugu
Updated: July 12, 2020, 7:33 PM IST
Breaking News: కరోనా పీడ విరగడయ్యే...వ్యాక్సిన్ సిద్ధం...రష్యా సైంటిస్టుల విజయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా...అని కలవరిస్తున్న ప్రపంచానికి రష్యా గుడ్‌న్యూస్ చెప్పింది. రష్యాకు చెందిన సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. దీంతో కరోనాతో సతమతమవుతున్న ప్రపంచానికి కాస్త ఊరట కల్పించింది. ఇప్పటికే వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అనేక దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు భారత్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. అటు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మరో వ్యాక్సిన్ కూడా క్లినికల్ టెస్ట్ దశలో ఉంది. దీంతో ఈ క్రమంలో ఆదివారం నాడు రష్యా గుడ్‌న్యూస్ తెలిపింది. సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో తొలి వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని.. వర్సిటీ విభాగ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ న్యూస్ ఏజెన్సీతో తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల బృందం బుధవారం డిశ్చార్జ్‌ కానుంది. ఇక రెండో బృందం జూలై 20వ తేదీన డిశ్చార్జ్‌ కానుందని తెలిపారు.



కాగా, రష్యాకు చెందిన మాస్కోకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారు చేసిన వ్యాక్సిన్‌ కూడా క్లినికల్ ట్రయల్స్‌ను గత నెల జూన్ 18న ప్రారంభించింది. ప్రస్తుతం సెచెనోవ్ యూనివర్సిటీ జరిపిన క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయని తారసోవ్ తెలిపారు.
Published by: Krishna Adithya
First published: July 12, 2020, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading