హోమ్ /వార్తలు /business /

Russia Ukraine War: యుద్ధం జరుగుతోంది అక్కడ..ప్రభావం ప్రపంచ దేశాలపైన..

Russia Ukraine War: యుద్ధం జరుగుతోంది అక్కడ..ప్రభావం ప్రపంచ దేశాలపైన..

War Problems: రష్య ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడి చమురు, గోల్డ్‌,దిగుమతులు, స్టాక్‌ మార్కెట్‌ల పతనం అన్నింటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చివరకు రష్యాన్‌ కరెన్సీ కనిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా యుద్ధం కారణంగా ఆ దేశం 66శాతం  ముడి చమురును అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది.

ఇంకా చదవండి ...

    రష్యా (Russia), ఉక్రెయిన్(Ukraine)మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాల(Global Market)పై ధరలభారం పడనుంది. ముఖ్యంగా బంగారం(Gold), వెండి (Silver)ధరల పెరుగుదల, ముడి చమురు(Crude oil)సంక్షోభంతో పాటు రష్యా కరెన్సీ పతనం కావడం వంటి పరిణామాలు ఒకదాని వెనుక ఒకటి దేశాలపై పడనుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనాన్ని కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్‌, యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. ఈ దాడి తర్వాత గ్లోబల్ మార్కెట్‌లో దారుణమైన విక్రయాలు జరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve)కూడా ఈ నెలలో వడ్డీ రేటును పెంచుతామని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 450 పాయింట్లు పడిపోయి 54,653 స్థాయి వద్ద, నిఫ్టీ 159 పాయింట్ల పతనంతో 16,339 వద్ద ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 828 పాయింట్ల నష్టంతో 54,274 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల పతనంతో 16,262 వద్ద ట్రేడయ్యాయి. స్టాక్‌ మార్కెట్‌ల పతనమే కాదు ప్రస్తుత పెరుగుదల కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధర 14 నెలల గరిష్టానికి చేరుకుంది. మల్టీ కమోడిటి ఎక్సేంజ్ అంచనాల ప్రకారం ఉదయం 10 గంటలకు, ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన బంగారం రూ. 52,011 స్థాయిలో రూ. 241 లాభంతో, జూన్ డెలివరీకి సంబంధించిన బంగారం రూ. 268 పెరుగుదలతో 52,217 స్థాయిలో ట్రేడైంది. వెండి కూడా ఇదే బాటలో ఉంది. మే నెలలో డెలివరీ చేసిన వెండి రూ.316 లాభంతో 68220 స్థాయిలోనూ, జూలై డెలివరీ వెండి రూ.180 లాభంతో 68762 స్థాయిలోనూ ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం 1942 డాలర్ల స్థాయిలో ఉండగా, వెండి 25.26 డాలర్ల స్థాయిలో ఉంది. బంగారం, వెండి జోరు ఇదే విధంగా కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    గ్లోబల్‌ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం..

    ఫిచ్ మరియు మూడీస్ రష్యా క్రెడిట్ రేటింగ్‌ను జంక్‌కి తగ్గించాయి. డాలర్‌తో పోలిస్తే రష్యా కరెన్సీ రూబుల్ పతనమై సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే 106 స్థాయిలో ఉంది. ట్రేడింగ్ సమయంలో ఇది 118 రూబిళ్లు స్థాయిని తాకింది. ఉక్రెయిన్ సంక్షోభం యొక్క చమురు ధరలపై అధిక ప్రభావాన్ని చూపుతోంది. ఈ సమయంలో, క్రూడాయిల్ బ్యారెల్‌కు $ 112 స్థాయిలో ట్రేడవుతోంది, ఇది ట్రేడింగ్ సమయంలో మార్చి 3 న $ 119 స్థాయికి చేరుకుంది. సరఫరా సమస్య కారణంగా ముడి చమురు 185 డాలర్లకు చేరుకోవచ్చని జెపి మోర్గాన్ చెప్పారు. రష్యా ప్రతిరోజూ 7.5 మిలియన్ బ్యారెళ్ల చమురుతో పాటు ప్రాసెస్ చేసిన వస్తువులను ఎగుమతి చేస్తుంది.

    రాను రాను మరింత ముదిరే అవకాశం..

    రష్యా బ్యాంకింగ్ వ్యవస్థపై అమెరికా, ఐరోపా దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. ఈ దేశాలు కూడా రష్యా చమురును వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులు, ఓడరేవులతో పాటు రవాణాదారులు రష్యా చమురు నుండి తమను తాము దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది 1970ల తర్వాత తలెత్తిన అతిపెద్ద చమురు సంక్షోభంగా ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థతో పాటు ఇతర దేశాలు కూడా ప్రస్తుతానికి ఉత్పత్తిని పెంచబోమని ప్రకటించాయి. రాబోయే కాలంలో ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున ఖరీదైన ముడి చమురు భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది.

    First published:

    ఉత్తమ కథలు