హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rural Business Ideas: పల్లెల్లో ఉంటున్నారా? తక్కువ పెట్టుబడితో చేయగలిగే ఈ వ్యాపారాలు ఇవే.. లక్షల్లో ఆదాయం

Rural Business Ideas: పల్లెల్లో ఉంటున్నారా? తక్కువ పెట్టుబడితో చేయగలిగే ఈ వ్యాపారాలు ఇవే.. లక్షల్లో ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లో కూడా మంచి వ్యాపార అవకాశాలున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్‌లను ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం., పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లో కూడా మంచి వ్యాపార అవకాశాలున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్‌లను ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  భారత్ వ్యవసాయ (Agriculture) ఆధారిత దేశం. ఇక్కడున్న జనాభాలో ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో రైతులదే కీలక పాత్ర. అందుకే ప్రభుత్వాలు కూడా వ్యవసాయానికి సంబంధించి అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వాటి ద్వారా ఖర్చుల భారం తగ్గి.. ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఐతే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల (Rural India) నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. గ్రామీణ యువత కూడా తమ తల్లిదండ్రులు, తాతల కాలం నుంచి వస్తున్న వ్యవసాయాన్ని కాదని.. జాబ్‌ల కోసం హైదరాబాద్‌ (Hyderabad) వంటి నగరాలకు వెళ్తున్నారు. తద్వారా గ్రామీణ భారతంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటోంది. కానీ పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లో కూడా మంచి వ్యాపార అవకాశాలున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్‌లను ప్రారంభిస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


  Fixed Deposits: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన బ్యాంకులు..


  డైరీ ఫామ్ (Dairy Farm):
  దేశంలో జనాభా పెరుగుదలతో పాటు పాలు, దాని నుంచి తయారైన ఉత్పత్తులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను పెద్ద పెద్ద కంపెనీలు నెరవేర్చలేకపోతున్నాయి. అందువల్ల మీరు కూడా మీ గ్రామంలో డైరీ ఫామ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. 10 ఆవులు, గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించవచ్చు. మంచి నాణ్యమైన పాలను అమ్మితే.. మంచి ధర కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఆవు, గేదెల పేడను పొలాలకు సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. ఈ విధంగా రైతులు తక్కువ ఖర్చుతో డెయిరీ ఫామ్ వ్యాపారాన్ని ప్రారంభించి.. మంచి ఆదాయం పొందవచ్చు.


  Home Loan: పెరుగుతున్న హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు.. బాదుడు మొదలు పెట్టిన ఆ రెండు సంస్థలు..


  వర్మీ కంపోస్ట్ (vermi compost):

  ప్రస్తుతం మనదేశంలో సేంద్రీయ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రజలు.. సేంద్రీయ పండ్లు, కూరగాయలు తినేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు కూడా సేంద్రీయ వ్యవసాయాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్నాయి. ఐతే చాలా చోట్ల ఎరువుల కొరత ఉంది. అందువల్ల చాలా మంది రైతులు రసాయనాలపై ఆధారపడుతున్నారు. మీరు వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను ప్రారంభిస్తే..మంచి లాభాలు వస్తాయి. ఈ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు, రాయితీలు, ఆర్థిక గ్రాంట్లు కూడా ఇస్తాయి.  బేకరీ ఉత్పత్తులు (Bakery Products):

  గ్రామానికి సమీపంలో ఉన్న పట్టణాలు బేకరీ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది. మీరు కూడా బేకరీని ఏర్పాటు చేస్తే.. అద్భుతమైన రాబడి వస్తుంది. ఈ వ్యాపారం ఎప్పుడూ విఫలమవదు. లక్షల్లో కూడా లాభాలు వస్తాయి. నేటి కాలంలో ప్రజలు ఆరోగ్య కారణాల దృష్ట్యా.. సేంద్రీయ, స్వచ్ఛమైన ఉత్పత్తులను డిమాండ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పోషకమైన ధాన్యాలు, పప్పులు, వాటి పిండి తయారీ యూనిట్‌తో కలిపి బేకరీ వ్యాపారం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. ఇందుకోసం మైక్రో ఫుడ్ ఇండస్ట్రీ అప్‌గ్రేడేషన్ స్కీమ్ కింద కూడా ఆర్థిక సహాయం తీసుకోవచ్చు .


  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas

  ఉత్తమ కథలు