మోదీ సర్కారు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.13గా నమోదయ్యింది. బుధవారం రూపాయి విలువ 43 పైసలు క్షీణించి..రికార్డు కనిష్ఠ స్థాయిలో 69.05 వద్ద ముగిసింది.
ట్రేడ్ వార్ తర్వాత చైనా కరెన్సీ యాన్ క్రమంగా క్షీణిస్తుండడం భారత కరెన్సీపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ కారణంగా ప్రపంచంలో మళ్లీ ఆర్థిక మాంధ్యం రావచ్చన్న ఊహాగానాలు కూడా రూపాయి పాలిట శాపంగా మారుతోంది. డాలర్‌తో పోలిస్తే యాన్ 0.28 క్షీణించి 6.7943గా నమోదయ్యింది. ఈ ఏడాదిలో యాన్ ఈ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి.
రూపాయి మారకం విలువ రికార్డు కనిష్ఠ స్థాయికి పతనం కావడంపై కాంగ్రెస్ నేతలు మోదీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం మీద, రూపాయి మీద, దర్యాప్తు సంస్థల మధ్య విశ్వాసం లేకుండా పోతేందని...ప్రజలు 2019లో మార్పు కోసం ఎదురుచూస్తున్నారంటూ మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.
No Confidence :
In the government
In the Rupee at an all time low of 69.05
In investigating agencies