Home /News /business /

RUPEE HITS LIFETIME LOW OF 79 RUPEES 92 PAISA AGAINST US DOLLAR TODAY UMG GH

Rupee Value: భారీగా క్షీణించిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనమైంది.. ఈ ప్రభావం ఎవరిపై ఉంటుందంటే..?

ప్రతీకాత్మక చిత్రం (Shutter Stock)

ప్రతీకాత్మక చిత్రం (Shutter Stock)

జులై 15న భారత రూపాయి యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు తగ్గి 79.92 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. గురువారం సెషన్‌లో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది.

ఇంకా చదవండి ...
రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి(Indian Rupee) విలువ రోజురోజుకూ దిగజారుతోంది. శుక్రవారం వరుసగా ఐదో సెషన్‌లో యూఎస్‌ డాలర్‌తో(US Dollar) పోలిస్తే రూపాయి విలువ రికార్డ్‌ స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, స్థానిక మార్కెట్ నుంచి ఫారెన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌(ఎఫ్‌ఐఐ-Foreign Institutional Investors) పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండటం, వాణిజ్య లోటు పెరగడం వంటి కారణాలతో భారత రూపాయి యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే భారీగా క్షీణించింది. జులై 15న భారత రూపాయి యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు తగ్గి 79.92 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

గురువారం సెషన్‌లో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో యూఎస్‌ డాలర్‌పై రూపాయి 79.72 వద్ద ప్రారంభమై 79.71కి చేరుకుంది. తిరిగి 79.92 పాయింట్ల ఆల్‌టైం రికార్డ్ లో-లెవల్‌కి చేరుకుంది. బుధవారం ట్రేడింగ్‌తో పోలిస్తే గురువారం ట్రేడింగ్‌లో తొమ్మిది పైసలు నష్టపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యులు, వివిధ కంపెనీలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని, ఆర్‌బీఐ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


దీనికి సంబంధించి ICICI డైరెక్ట్ విడుదల చేసిన ఓ ప్రకటనలో..‘బలమైన డాలర్, నిరాశావాద గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ల మధ్య రూపాయి నేడు క్షీణిస్తుంది. స్థిరమైన FII అవుట్‌ఫ్లోలు, దూసుకుపోతున్న మాంద్యంపై ఆందోళనలు రూపాయిని దెబ్బతీస్తాయి. ఇంకా యూఎస్‌ నుంచి కీలకమైన ఆర్థిక డేటా, ఫెడ్ అధికారుల ప్రకటనల ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. యూఎస్‌ డాలర్‌, భారత రూపాయి(జులై) 79.60- 80.20 శ్రేణిలో ట్రేడ్‌ అవుతుందని అంచనాలు ఉన్నాయి’ అని పేర్కొంది.



* రూపాయి విలువ తగ్గితే నష్టాలివే..
యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుండటం సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు ఎక్కువ ధర చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్‌లలోనే జరుగుతుంది కాబట్టి, సప్లై చేసే దేశానికి డాలర్‌లలోనే డబ్బు చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ముడిసరకు ఎక్కువగా దిగుమతి చేసుకునే కంపెనీలపై ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇతర దేశాలకు విహారయాత్రకు వెళ్లాలంటే కూడా ఎక్కువ నగదు అవసరమవుతుంది. ఇతర దేశాలకు పై చదువులకు వెళ్లే విద్యార్థులపై భారం పెరుగుతుంది. ఇతర దేశాలకు వస్తువులు, సేవలు అందించే కంపెనీలు మాత్రం లాభపడతాయి.
Published by:Mahesh
First published:

Tags: Indian Economy, Rupee value, Stock Market, Us

తదుపరి వార్తలు