కొనసాగుతున్న రూపాయి పతనం!

రూపాయి విలువ పడిపోతూనే ఉంది. డాలర్‌తో రూపాయి మారకం ప్రస్తుత విలువ రూ.72.34. మరోవైపు స్టాక్‌మార్కెట్లు కూడా ఇలాగే పడిపోతున్నాయి.

news18-telugu
Updated: September 10, 2018, 10:48 AM IST
కొనసాగుతున్న రూపాయి పతనం!
రూపాయి విలువ పడిపోతూనే ఉంది. డాలర్‌తో రూపాయి మారకం ప్రస్తుత విలువ రూ.72.34. మరోవైపు స్టాక్‌మార్కెట్లు కూడా ఇలాగే పడిపోతున్నాయి.
  • Share this:
రూపాయి విలువ రోజురోజుకీ దిగజారిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి వ్యాల్యూ దారుణంగా క్షీణిస్తోంది. ఎప్పటికప్పుడు ఆల్‌ టైమ్ లో తాకుతూ రికార్డులు సృష్టిస్తోంది. చివరి సెషన్‌లో రూ.71.74 దగ్గర ముగిసిన రూపాయి విలువ ఈరోజు 42 పైసల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. రూ.72.15 దగ్గర మొదలై ప్రస్తుతం రూ.72.34 దగ్గర కొనసాగుతోంది రూపాయి విలువ.

మరోవైపు స్టాక్‌ మార్కెట్లు కూడా అంతే. సెన్సెక్స్ ఏకంగా 208 పాయింట్లు పడిపోయింది. ప్రస్తుతం 38,178 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. 66 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 11,523 దగ్గర కొనసాగుతోంది. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటం, ఇంకోవైపు రూపాయి విలువ దారుణంగా పడిపోవడం... మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?
First published: September 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు