మరింత బక్కచిక్కిన రూపాయి...జీవితకాల కనిష్ఠ స్థాయికి..!

మరింత బక్కచిక్కిన రూపాయి...జీవితకాల కనిష్ఠ స్థాయికి..!

మరింత క్షీణించిన రూపాయి విలువ(Illustration by Mir Suhail/News18)

ఈరోజు రూపాయి డాలరుతో రూపాయి విలువ జీవిత‌కాల దిగువ‌కు ప‌డిపోయి రూ.70.70గా న‌మోదైంది. గత సెష‌న్ ముగింపుతో పోలిస్తే 23 పైస‌లు ప‌డిపోయింది.

 • Share this:
  రూపాయి పతనం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా నేల చూపులు చూస్తున్న రూపాయి... మరోసారి మరింత దిగువకు జారిపోయింది. గత సెషన్ లో డాలర్ తో పోలిస్తే 70.59 రూపాయల దగ్గర ముగిసిన రూపాయి విలువ‌... నేడు మరింతగా క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెన్‌ ఎక్స్ఛేంజి(ఫారెక్స్‌) ఈరోజు రూపాయి డాలరుతో రూపాయి విలువ జీవిత‌కాల కనిష్ఠ స్థాయికి ప‌డిపోయి రూ.70.82గా న‌మోదైంది. గత సెష‌న్ ముగింపుతో పోలిస్తే మరో 23 పైస‌లు ప‌డిపోయింది. దిగుమ‌తిదారుల నుంచి అమెరిక‌న్ క‌రెన్సీకి ఉన్న డిమాండ్, భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు కూడా రూపాయి ప‌త‌నానికి కార‌ణ‌మ‌ని ఫారెన్స్ ట్రేడ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంత‌ర్జాతీయ వాణిజ్య ప‌రిణామాలు, ట‌ర్కీ ఆర్థిక సంక్షోభం కార‌ణంగా కొద్ది రోజుల నుంచి డాల‌ర్ తో రూపాయి విలువ క్ర‌మ‌క్ర‌మంగా క్షీణిస్తూ వ‌స్తోంది.

  ఇది కూడా చదవండి:
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  అగ్ర కథనాలు