రికార్డు కనిష్ఠ స్థాయికి రూపాయి...డాలర్@రూ.72.97

రూపాయి విలువ మరింత క్షీణించకుండా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అయినా ఈ ప్రకటన రూపాయి విలువ మరింత క్షీణించకుండా అడ్డుకోలేకపోయింది.

news18-telugu
Updated: September 18, 2018, 8:44 PM IST
రికార్డు కనిష్ఠ స్థాయికి రూపాయి...డాలర్@రూ.72.97
మరింత క్షీణించిన రూపాయి విలువ(Illustration by Mir Suhail)
  • Share this:
రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. ఫోరెక్స్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపుగా 73కి పడిపోయింది. రికార్డు కనిష్ఠ స్థాయిలో రూపాయి విలువ 72.97కు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల ప్రతికూల పరిస్థితులు, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, చైనా-అమెరికాల మధ్య ట్రేడ్ వార్ తదితర అంశాలు రూపాయి విలువను దిగజార్చాయి.

గత వారం రూపాయి విలువ 72.92గా నమోదుకావడం ఇప్పటి వరకు జీవనకాల కనిష్ఠ స్థాయిగా ఉంటోంది. మంగళవారం ఇది 72.97కు పడిపోయింది. చివరకు 72.69 వద్ద ఇప్పటి వరకు అత్యంత కనిష్ఠ స్థాయిలో ముగిసింది.


రూపాయి విలువ మరింత క్షీణించకుండా కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అయినా ఈ ప్రకటన రూపాయి విలువ మరింత క్షీణించకుండా అడ్డుకోలేకపోయింది.

అటు రూపాయి క్షీణిత కారణంగా ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది. దీని దిగుమతులు  తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

రెండో రోజూ స్టాక్ మార్కెట్లు ఢమాల్
అటు రూపాయి క్షీణిత వంటి పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. సోమవారం 505 పాయింట్లు నష్టపోయిన బీఎస్ఈ సెన్సెక్స్...మంగళవారం మరో 295 పాయింట్లు నష్టపోయింది. 295 పాయింట్ల నష్టంతో 37,291 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ముగిసింది.
Published by: Janardhan V
First published: September 18, 2018, 7:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading