కరోనా దెబ్బకు చరిత్రలోనే తొలిసారి రూపాయి భారీ పతనం...

మధ్యాహ్నం 12.10 ప్రాంతంలో ఏకంగా 81 పైసలు పతనమైంది. 75.08 వద్ద కనిష్టం నమోదైంది. ఈ స్థాయి చరిత్రలోనే కనిష్టం.

news18-telugu
Updated: March 19, 2020, 3:33 PM IST
కరోనా దెబ్బకు చరిత్రలోనే తొలిసారి రూపాయి భారీ పతనం...
Rupee Value
  • Share this:
కరోనా వైరస్‌ దెబ్బకు డాలరుతో మారకంలో రూపాయి తొలిసారి 75 మార్క్‌ను తాకింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి తొలుత 74.95 వద్ద ప్రారంభమైంది. బుధవారం ముగింపు 74.25తో పోలిస్తే ఇది 70 పైసల నష్టంకాగా.. తదుపరి మరింత బలహీనపడింది. మధ్యాహ్నం 12.10 ప్రాంతంలో ఏకంగా 81 పైసలు పతనమైంది. 75.08 వద్ద కనిష్టం నమోదైంది. ఈ స్థాయి చరిత్రలోనే కనిష్టం.  ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకోవచ్చన్న అంచనాలు, ఆందోళనలు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ముడిచమురు, కరెన్సీలను సైతం దెబ్బతీస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో డాలరుతో మారకంలో రూపాయి 74.50 వద్ద రికార్డ్‌ కనిష్టాన్ని తాకింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ తాజాగా 100ను సైతం అధిగమించడంతో దేశీ కరెన్సీ బలహీనపడినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. బుధవారం రూపాయి నామమాత్రంగా 2 పైసలు నీరసించి 74.26 వద్ద నిలవగా.. మంగళవారం సైతం ఇదే ధోరణిలో 74.28 వద్ద స్థిరపడింది.
Published by: Krishna Adithya
First published: March 19, 2020, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading