రూ.1000 పెట్టుబడితో...రూ.15 లక్షలు...అసలు సంగతి తెలిస్తే మైండ్ బ్లాకే...

జనవరి 27 న, రుచి సోయా మరోసారి స్టాక్ మార్కెట్లో రూ.3ల వద్ద లిస్ట్ అయ్యింది. అయితే రుచి సోయా షేర్లు ఏకంగా 8818% లాభపడ్డాయి. కేవలం 103 ట్రేడింగ్ సెషన్లలో రూ .500 కోట్ల నుంచి రూ. 44,600 కోట్లకు పెరిగింది.

Krishna Adithya | news18-telugu
Updated: August 25, 2020, 1:15 AM IST
రూ.1000 పెట్టుబడితో...రూ.15 లక్షలు...అసలు సంగతి తెలిస్తే మైండ్ బ్లాకే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
బాబా రామ్‌దేవ్ సంస్థ పతంజలి ఈ మధ్య కాలంలో దివాలా తీసిన రుచి సోయాను కొనుగోలు చేసింది. దీంతో ఈ సంస్థ సంవత్సర కాలంగా కొనుగోలు వార్తలతో ఈ స్టాక్ అద్భుతాలు చేసింది. గత సంవత్సరం, రుచి సోయా దివాళా తీసినప్పటికీ, పతంజలి కొనుగోలు వార్తలతో ఈ సంవత్సరం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్ టాప్ 60 కంపెనీలలో చేరింది. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏమిటంటే... ఒక సంవత్సరంలోనే కంపెనీ షేర్లలో ఇంత విపరీతమైన ర్యాలీ జరగడానికి కారణం ఏమిటనే దానిపై విశ్లేషకులు..తలలు పట్టుకుంటున్నారు. ఈ పెరుగుదలను కొందరు నిపుణులు ఎలాంటి ఫండమెంటల్స్ కనబడటం లేదని...దీంతో మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెబీని దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు.

జనవరి 27 న, రుచి సోయా మరోసారి స్టాక్ మార్కెట్లో రూ.3 ల వద్ద లిస్ట్ అయినట్లు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. అయితే జనవరి నుంచి ఇప్పటి వరకూ రుచి సోయా షేర్లు ఏకంగా 8818% లాభపడ్డాయి. కంపెనీ షేర్ విలువ శుక్రవారం రూ .1507 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కేవలం 103 ట్రేడింగ్ సెషన్లలో రూ .500 కోట్ల నుంచి రూ. 44,600 కోట్లకు పెరిగింది. మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రుచి సోయా షేర్లు సోమవారం 5 శాతం పడిపోయాయి. దాని షేర్లు ఇప్పుడు రూ .1431.95 వద్ద ట్రేడవుతున్నాయి.

మార్కెట్ క్యాప్ విషయానికొస్తే, రుచి సోయా ఇప్పుడు లుపిన్, టోరెంట్ ఫార్మా, టాటా స్టీల్, అంబుజా సిమెంట్, హెచ్‌పిసిఎల్, గ్రాసిమ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హిండాల్కో, యుపిఎల్, కోల్‌గేట్ పామోలివ్ మరియు హావెల్స్‌ ఇండియా కంటే పెద్ద సంస్థగా మారింది.

విశ్లేషకుల అభిప్రాయం ఏమిటి?
అయితే, రుచి సోయా షేర్లలో ఈ పదునైన పెరుగుదల విశ్లేషకులు ఆకట్టుకోలేదు. స్టాక్స్‌లో ఈ పెరుగుదలకు కారణం ఏమిటో సెబీ దర్యాప్తు చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. 25% కనీస పబ్లిక్ హోల్డింగ్ పరిస్థితిని ఎప్పుడు నెరవేరుస్తుందో రెగ్యులేటర్ సంస్థను అడగాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ఈ ర్యాలీ గాలి బుడగేనా...?
మే నెలలో వరుసగా 6 ట్రేడింగ్ సెషన్లలో రుచి సోయా షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. లిస్టింగ్ అనంతరం సంస్థ షేర్లు ఎగువ సర్క్యూట్ లో కనిపించాయి. నవంబర్ 2019 లో రుచి సోయా షేర్లను డీలిస్ట్ చేసినప్పుడు, దాని షేర్ల ధర కేవలం రూ. 3.32. మాత్రమే.ఎకనామిక్ టైమ్స్ వార్తల ప్రకారం, కోల్‌కతా పెట్టుబడిదారు అరుణ్ ముఖర్జీ మాట్లాడుతూ కంపెనీ షేర్లు పెరగడానికి దాని షేర్లలో లో ఫ్రీ ఫ్లోట్ కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. దీనికి ప్రాథమిక కారణం లేదు. ఇది నేరుగా డిమాండ్-సరఫరా డైనమిక్ ప్రభావంగా పేర్కొన్నారు.

31 మార్చి 2020 నాటికి, సంస్థలో ప్రమోటర్ వాటా 99.03 శాతంగా ఉంది. దీనీపై ముఖర్జీ మాట్లాడుతూ, "రిటైల్ పెట్టుబడిదారుడికి కంపెనీలో 1 శాతం కన్నా తక్కువ వాటా ఉంది. సెబీ ఈ విషయంపై దృష్టి సారించి ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలో ఉంచాలని నమ్ముతున్నానని... రిటైల్ పెట్టుబడిదారులు అలాంటి షేర్లలో పెట్టుబడులు పెట్టకూడదు" అని ఆయన సూచించారు" కంపెనీ స్టాక్ మార్కెట్లో 29.58 కోట్ల షేర్లను కలిగి ఉంది. ఇందులో పతంజలి గ్రూప్‌ కు చెందిన 98.87% షేర్లు ఉన్నాయి. మిగిలిన 33.4 లక్షల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లు కలిగి ఉన్నారు.
Published by: Krishna Adithya
First published: August 25, 2020, 1:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading