Home /News /business /

RTGS: ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్... ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే

RTGS: ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్... ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే

RTGS: ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్... ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే
(ప్రతీకాత్మక చిత్రం)

RTGS: ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్... ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే (ప్రతీకాత్మక చిత్రం)

RTGS Transactions | భారీ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గుడ్ న్యూస్ చెప్పింది.

    బ్యాంకుల్లో భారీగా లావాదేవీలు జరిపే వారికి అలర్ట్. ఎక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS పద్ధతి ఎంచుకోక తప్పదు. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ టైమింగ్స్ చూస్తే ఉదయం 7 గంటల ఈ పేమెంట్స్ మొదలౌతాయి. సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేయొచ్చు. అంటే రోజంతా కేవలం 11 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ చేయడం సాధ్యం కాదు. కేవలం వర్కింగ్ డేస్‌లో మాత్రమే ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు మరింత వెసులుబాటు కల్పించేందుకు, డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI పలు చర్యల్ని తీసుకుంది. ఆర్‌టీజీఎస్ పేమెంట్ సిస్టమ్ డిసెంబర్ నుంచి 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. అయితే డిసెంబర్ 1 నుంచే ఆర్‌టీజీఎస్ 24 గంటలు పనిచేస్తుందని అనుకున్నారు. కానీ ఇంకా 24 గంటల సేవలు మొదలు కాలేదు. దీనిపై తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చింది ఆర్‌బీఐ.

    SBI ATM PIN: ఏటీఎం కార్డ్ పిన్ మర్చిపోయారా? ఒక్క కాల్‌తో కొత్త పిన్ జనరేట్ చేయొచ్చు

    IRCTC Ooty Tour: రూ.6,000 ఉంటే ఊటీ చుట్టేయొచ్చు... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

    డిసెంబర్ 14 నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు రోజంతా అంటే 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 14 అర్థరాత్రి 12.30 గంటల నుంచి 24 గంటల సేవలు మొదలౌతాయని ఆర్‌బీఐ చెప్పింది. అందుకు తగ్గట్టుగా పేమెంట్ సిస్టమ్‌లో మార్పులు చేస్తోంది. ప్రస్తుతం నెఫ్ట్ సిస్టమ్ ద్వారా పేమెంట్స్ 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 14 నుంచి ఆర్‌టీజీఎస్ కూడా ఫుల్ డే అందుబాటులో ఉంటుంది. ఆర్‌టీజీఎస్ ద్వారా పేమెంట్ చేయాలంటే కనీసం రూ.2,00,000 ట్రాన్స్‌ఫర్ చేయాలి. గరిష్ట పరిమితి లేదు.

    రోజూ 3జీబీ డేటా కావాలా? ఈ Jio, Airtel, Vi ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి

    HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ చాలా సింపుల్... చేయండి ఇలా

    గతంలో ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకే అందుబాటులో ఉండేవి. లాక్‌డౌన్ కాలంలో ఈ సమయాన్ని పొడిగించింది ఆర్‌బీఐ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్‌టీజీఎస్ పేమెంట్స్‌ జరిగేలా మార్పులు చేసింది. ఓ వారం తర్వాత ఆర్‌టీజీఎస్ పేమెంట్స్ 24 గంటలు అందుబాటులోకి వస్తాయి. ఎవరికైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చన్న సంగతి తెలిసిందే.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Personal Finance, Rbi, Reserve Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు